డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు: సీఎస్ డిసెంబర్ 7,8,9 తేదీల్లో ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. పీవీ మార్గ్‌లో ఉన్న ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా సంఘాలకు చెందిన 120 ఫుడ్, హస్తకళల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 04 Dec 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమాలకు సంబంధించి సీఎస్ శాంతి కుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 7,8,9 తేదీల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వీటి నిర్వహణపై ఉన్నతాధికారులతో బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు పీవీ మార్గ్‌లో ఉన్న ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా సంఘాలకు చెందిన 120 ఫుడ్, హస్తకళల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? డిసెంబర్ 7న వందేమాతరం శ్రీనివాస్, 8న రాహుల్ సిప్లిగంజ్, 9న థమన్ బృందంతో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు శాంతికుమారి తెలిపారు. ఇక 9న సెక్రటేరియట్ ప్రాంగణంలో లక్ష మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లివిగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారని చెప్పారు. ఆ తర్వాత భారీ డ్రోన్, లేజర్, క్రాకర్ షోలు ఉంటాయని పేర్కొన్నారు. అలాగే తెలుగుతల్లి ఫ్లైఓవర్ నుంచి పీవీ మార్గ్ వరకు ఐదు కేంద్రాల వద్ద భిన్న రీతుల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎస్ చెప్పారు. Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! అలాగే ప్రత్యేకంగా సెల్ఫీ పాయింట్లు సైతం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ట్యాంక్ బండ్, రాజీవ్ గాంధీ జంక్షన్, సచివాలయం, ఇందిరా గాంధీ విగ్రహం, పీవీ మార్గ్‌లో విద్యుత్ దీపాలతో అలంకరించనున్నట్లు చెప్పారు. అయితే ఈ మూడు రోజుల పాటు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఉండకుండా తాగునీరు, టాయిలెట్లు, భద్రత, పార్కింగ్ వంటి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే! Also Read: ట్రాఫిక్‌వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు.. ఈవెంట్స్‌లో 44 మంది క్వాలిఫై #cs-shantikumari #telugu-news #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి