ట్రాఫిక్‌ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు.. ఈవెంట్స్‌లో 44 మంది క్వాలిఫై

బుధవారం గోషామహల్ ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రాన్స్‌జెండర్లకు రన్నింగ్, జంపింగ్‌లతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించారు. ఇందులో 58 మంది ట్రాన్స్‌జెండర్లు పాల్గొనగా.. 44 మంది క్వాలిఫై అయ్యారు.

New Update
Transgenders2

ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమిస్తామని గతంలోనే రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి సూచనల మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గోషామహల్ ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో వీళ్లకి ఈవెంట్లను నిర్వహించారు. రన్నింగ్, జంపింగ్‌ అలాగే ఇతర పరీక్షలు కూడా నిర్వహించారు. ఇందులో క్వాలిఫై అయినవారికి ప్రత్యేకంగా ట్రాఫిక్ నిబంధనల అమలుపై ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి తీసుకోనున్నారు.   

Also Read: పురుషులకు నెలసరి వస్తే తెలిసేది.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో మూడు వేల మందికి పైగా ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీళ్లలో వెయ్యిమంది హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ వాలంటీర్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారని గుర్తించి నియమించేందుకు వీలుగా పోలీసులకు గతంలోనే సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ట్రాఫిక్ విభాగంలో పోలీసులు, హోంగార్డులే విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ల తరహాలోనే ట్రాన్స్‌జెండర్లు కూడా వాలంటీర్లుగా పనిచేయనున్నారు.  

Also Read: ‘పుష్ప2’ ప్రీమియర్‌కు ముందు పోలీసుల లాఠీ ఛార్జ్!

అయితే బుధవారం జరిగిన ఈవెంట్స్‌లో 58 మంది ట్రాన్స్‌జెండర్లు పాల్గొన్నారు. ఇందులో 44 మంది ఎంపికయ్యారు. వీళ్లలో 29 మంది ఉమెన్స్, 15 మంది మెన్స్‌ ట్రాన్స్‌జెండర్స్ ఉన్నారు. వంద మీటర్ల రన్నింగ్, 800 మీటర్ల రన్నింగ్, షార్ట్‌పుట్, లాంగ్‌జంప్‌ లాంటి పోటీలు నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్స్‌కు హాజరయ్యేందుకు కొన్ని అర్హతలు కూడా ఉన్నాయి. అవేంటంటే 18 ఏళ్లు పూర్తయి ఉండాలి. పదో తరగతి సర్టిఫికేట్, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్ తప్పకుండా ఉండాలి. ఈ సర్టిఫికేట్ల ఆధారంగా అధికారులు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో అర్హులైన వారిని ఎంపిక చేసి పది రోజుల పాటు ట్రాఫిక్ విధులపై ట్రైనింగ్ ఇస్తారు. అలాగే వీళ్లకు ప్రత్యేక యూనిఫాంతో పాటు ప్రతీనెల స్టైఫండ్ కూడా ఇస్తారు. 

Also Read: కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే భూకంపం: భూగర్భ శాస్త్రవేత్త

Also read: 96 రకాల సీతాకోకచిలక జాతులు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో గ్రాండ్‌గా ఈవెంట్

 

Advertisment
Advertisment
తాజా కథనాలు