/rtv/media/media_files/2025/04/29/qDaqTRPEekMP3k4vDgsA.jpg)
పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్‌కు అవి తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. దీంతో ఇరు దేశాల మధ్య మాటమాట పెరిగి యుద్ధ పరిస్థితి నెలకొంది. గడిచిన కొన్ని రోజులుగా పాక్, భారత్ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు టర్కీ దేశం ఆయుధాలు సరఫరా చేసిందనే వార్తలు కూడా వినిపించాయి. పాకిస్తాన్‌కు టర్కీ ఎప్పటి నుంచో సపోర్ట్ ఉంది. ఒక టర్కిష్ సీ-130ఈ హెర్క్యులస్ విమానం కరాచీలో దిగినట్లు తెలుస్తోంది. ఈ విమానంలో టర్కీ పాకిస్థాన్‌కు మిలటరీ కార్గోను తరలించినట్లు సమాచారం. ఈ విమానం ఏప్రిల్ 28న అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. అయితే గతంలో టర్కీకి భారత్ ఎన్నో సందర్భాల్లో సాయం చేసింది.
Big Shock to Pakistan
— Clear Nama (@Clear_Nama) April 28, 2025
Turkey Defence Ministery denies l to send any arms materials and Military support to Pakistan.#Turkey #Pakistan pic.twitter.com/utL2h5M4x4
2023లో టర్కీలో భూకంపం సంభవించినప్పుడు భారత్ సహాయక చర్యలకు సిబ్బంది, మెడిసిన్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు టర్కీకి పంపించింది. అవన్నీ మరిచి ఇప్పుడు భారత్ శత్రువు పక్కకు చేరి ఆయుధాలు అందిస్తోందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టర్కీ అధ్యక్ష కార్యాలయ సమాచార విభాగం మాత్రం ఈ వార్తలను ఖండించింది. టర్కీకి చెందిన ఒక కార్గో విమానం ఇంధనం నింపుకోవడం కోసం పాకిస్థాన్‌లో దిగింది. ఆ తర్వాత అది తన గమ్యస్థానానికి వెళ్లిపోయిందని చెప్పుకొచ్చింది. టర్కీ పాకిస్థాన్‌కు మిలటరీ కార్గోను డెలివరీ చేసింది. కానీ.. ఆ విషయం బయటకు తెలియడం, అంతర్జాతీయంగా విమర్శలు రావడంతో మళ్లీ వెనక్కి తగ్గిందని పలువురు ఆరోపిస్తున్నారు. చైనా పీఎల్-15 లాంగ్ రేంజ్ మిస్సైల్‌ను పాకిస్థాన్‌కు సరఫరా చేసిందని కూడా వార్తల వచ్చాయి. టర్కీ ఈ వార్తలను ఖండించగా.. డ్రాగన్ మాత్రం స్పందించలేదు.
Also read: BIG BREAKING: భారత్ సర్జికల్ స్ట్రైక్స్.. స్పాట్‌లో 200 మంది టెర్రరిస్టులు!
ప్రపంచ దేశాలన్ని పహల్గాం ఉగ్రదాడిని ఖండించాయి. టర్కీ, చైనా మాత్రం పాక్‌కు అండగా నిలుస్తున్నాయి. భారత్ దాడి చేస్తుందనే భయంతో పాక్ తన మిత్ర దేశాల నుంచి ఆయుధాలను సమకూర్చుకుంటుంది. అందులో భాగంగా టర్కీ సాయం కోరిందని వార్తలు వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి రోజు పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అంకారాలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో సమావేశంలో ఉన్నారు. పాకిస్థాన్‌కు సాయం చేసే దేశాల్లో టర్కీ ఒకటి. ఇది ఐక్యరాజ్యసమితితో సహా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ వివాదాన్ని లేవనెత్తుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌కు సాయం చేసేందుకు మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ విమానాలను పంపిందని వార్తలొచ్చాయి.
(turkey | Turkey Earthquake | pakistan | india pak war | weapons | indian-army | latest-telugu-news)