kavitha : రేవంత్ సీఎం కావడం తెలంగాణ ఖర్మ.. ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌లా మాట్లాడి తన స్థాయి తగ్గించుకోలేనని అన్నారు. సుప్రీం కోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి తీరు మారలేదన్న కవిత..  సుప్రీంకోర్టుతో తిట్లు తిన్న మొదటి సీఎం రేవంత్ కావడం తెలంగాణ ఖర్మ అని చెప్పారు.

New Update
kavitha nizmabad

సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌లా మాట్లాడి తన స్థాయి తగ్గించుకోలేనని అన్నారు. సుప్రీం కోర్టు చెప్పినా రేవంత్ రెడ్డి తీరు మారలేదన్న కవిత..  సుప్రీంకోర్టుతో తిట్లు తిన్న మొదటి సీఎం రేవంత్ కావడం తెలంగాణ ఖర్మ అని చెప్పారు. సీఎం విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని కవిత మండిపడ్దారు. రేవంత్‌ రెడ్డి లాంటి వ్యక్తి సీఎంగా ఉండటం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమంటూ సంచలన కామెంట్స్ చేశారు. నిజామాబాద్‌ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పట్టణంలోని పసుపు మార్కెట్‌ యార్డును కవిత సందర్శించారు.  ఈ సందర్భంగా ఆమె ఈ కామెంట్స్ చేశారు.

Also Read :  సీఎం రేవంత్ తో కోనేరు కోనప్ప భేటీ.. ఆ హామీ ఇస్తేనే పార్టీలో ఉంటానని కండీషన్?

 నామమాత్రంగా పసుపు బోర్డు

పసుపు బోర్డు ఏర్పాటుపై కవిత మాట్లాడుతూ..  పసుపు బోర్డును ఏదో నామమాత్రంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు.  పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయిస్తే రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రోజురోజుకూ పసుపు ధర పతనం అవుతోందన్న కవిత...రూ.15వేల మద్దతు ధర ఇస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయని విమర్శించారు. వ్యాపారులు సిండికేట్ అయి పసుపు రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రభుత్వానికి మార్చి 1వతేదీ వరకు డెడ్ లైన్ విధిస్తున్నామని.. సుపు క్వింటాలుకు పదిహేను వేల ధర ఇవ్వకుంటే రైతులతో కలిసి కలెక్టరేటును ముట్టడిస్తామని హెచ్చరించారు.  

చంద్రబాబుపైనే ఎక్కువ ప్రేమ

బనకచర్ల నుంచి మన నీటిని ఏపీ ఎత్తుకుపోతుంటే రేవంత్‌ రెడ్డి  చూస్తూ నిలబడ్డారంటూ కవిత మండిపడ్డారు.  తెలంగాణపై ప్రేమ ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ కంటే చంద్రబాబుపైనే ఎక్కువ ప్రేమ ఉందని విమర్శించారు.  రైతుల ఉసురు తీసి గోదావరి, కృష్ణా జలాలను ఇచ్చి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని కవిత నిలదీశారు.  

Also read :  కొత్త ప్రేయసితో శిఖ‌ర్ ధావ‌న్‌.. ఆమె ఎవ‌రో తెలుసా? 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు