/rtv/media/media_files/2025/10/31/mahabubabad-2025-10-31-08-14-42.jpg)
మహబూబాబాద్(mahabubabad) ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఒక అత్యంత అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బతికున్న ఒక వ్యక్తిని మృతి చెందాడని పొరబడి, ఆసుపత్రి సిబ్బంది రాత్రంతా మార్చురీలో ఉంచి తాళం వేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ఆ రాత్రంతా మార్చురీ గదిలో ప్రాణభయంతో గడపాల్సి వచ్చింది.
చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ మూడు రోజుల క్రితం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. చికిత్స కోసం వచ్చిన రాజుకు తోడుగా అటెండెంట్ లేదా ఆధార్ కార్డు లేదనే కారణంతో ఆసుపత్రి సిబ్బంది అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు. రెండు రోజులుగా ఆసుపత్రి ఆవరణలోనే పడిగాపులు కాస్తూ, ఆహారం లేకపోవడం, అనారోగ్యం కారణంగా రాజు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. నిస్సత్తువతో కదలిక లేకుండా పడి ఉన్న రాజును చూసిన సిబ్బంది... అతను మరణించాడనే పొరపాటుతో అతడిని స్ట్రెచర్‌పై మార్చురీ గదిలోకి తరలించి తాళం వేశారు.
బతికున్న రాజు ఆ రాత్రంతా మార్చురీలోని అత్యంత చల్లటి వాతావరణంలో భయభ్రాంతులకు గురయ్యాడు. మరుసటి రోజు ఉదయం మార్చురీ గదిని శుభ్రం చేయడానికి వచ్చిన స్వీపర్ రాజు శరీరంలో కదలికను, స్వల్పంగా ఏడుపు శబ్దాన్ని గుర్తించాడు. వెంటనే సూపర్‌వైజర్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు స్పందించి మార్చురీ తాళం తీయించి రాజును బయటకు తీశారు. బతికి ఉన్న రాజును హుటాహుటిన ఏఎంసీ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
Also Read : ఖమ్మం జిల్లాలో దారుణం.. CPM నేత దారుణ హత్య
బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టడం
ఈ దారుణ ఘటనపై స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధార్ లేదనే సాకుతో చికిత్స నిరాకరించడం, బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టడం సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శిస్తున్నారు. ఘటనపై స్పందించిన ఆసుపత్రి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఆధార్ కార్డు, అటెండెంట్ లేకున్నా రోగులకు తప్పకుండా చికిత్స అందించాలని RMO స్పష్టం చేశారు.
Also Read : ఒక్కో ఎకరాకు రూ.10 వేలు.. రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్!
/rtv/media/member_avatars/2025/05/07/2025-05-07t015022634z-vamshi.jpg )
 Follow Us
 Follow Us