Samineni Ramarao: ఖమ్మం జిల్లాలో దారుణం.. CPM నేత దారుణ హత్య

ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది.. సీపీఎం నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయం వాకింగ్‌ వెళ్లిన సామినేని రామారావును గొంతు కోసి పరారయ్యారు నిందితులు.  చింతకాని మండలం పాతర్లపాడులో ఘటన చోటుచేసుకుంది.

New Update
cpm

ఖమ్మం జిల్లా(khammam)లో దారుణం జరిగింది.. సీపీఎం(cpm) నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉదయం వాకింగ్‌ వెళ్లిన సామినేని రామారావు(Samineni Ramarao)ను గొంతు కోసి పరారయ్యారు నిందితులు.  చింతకాని మండలం పాతర్లపాడులో ఘటన చోటుచేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకున్నారు. రామారావు హత్యకు కారణాలపై పోలీసుల దర్యాప్తు చేపడుతున్నారు. స్థానిక రాజకీయ విభేదాలా లేక ఇతర కారణాల వల్ల హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వాస్తవానికి సామినేని రామారావు మనవరాలి పెళ్లి ఇంకో మూడు రోజుల్లో ఖమ్మంలో జరగాల్సి ఉంది. ఈ శుభకార్యానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.  

Also Read :  బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టారు.. రాత్రంతా శవాల మధ్యే

Also Read :  ఒక్కో ఎకరాకు రూ.10 వేలు.. రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్!

భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి

ఈ  ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(bhatti vikramarka) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుల్ని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు భట్టి.  ఖమ్మంలో శాంతి భద్రతలపై పోలీసులతో ఆయన మాట్లాడారు.  ఖమ్మంలో హింసా రాజకీయాలకు తావులేదన్నారు.  ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సీపీఎం నాయకులు, రైతు సంఘం కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతర్లపాడు మాజీ సర్పంచ్‌గా రామారావు పనిచేశారు. 

Advertisment
తాజా కథనాలు