/rtv/media/media_files/2026/03/02/no-entry-for-women-in-sabarimala-temple-2026-03-02-17-55-29.jpg)
No entry for women in Sabarimala temple
Sabarimala Temple : కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళల ఎంట్రీకి సంబంధించి ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) కీలక నిర్ణయం తీసుకుంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలను, సంప్రదాయాలను కాపాడేందుకు ఇక మీదట మహిళలను దేవాలయంలోకి అనుమతించరాదని నిర్ణయించింది. అనేక దశాబ్ధాలుగా ఆలయంలో కొనసాగుతున్న సంప్రదాయాలనే తాము సమర్థిస్తున్నామని, మహిళల ప్రవేశంపై పాత ఆచారాలనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నామని బోర్డు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 14లోగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఈ రోజు సోమవారం (మార్చి 2) జరిగిన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అనేక దశాబ్ధాలుగా శబరిమల ఆలయంలోకి మహిళలకు అనుమతి లేదు. ముఖ్యంగా పది సంవత్సరాల్లోపు బాలికలు, ఆపై 50 ఏళ్లు పైబడిన వారినే అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తారు. దీన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. అయితే 2018లో సుప్రీంకోర్టు మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ తీర్పునిచ్చింది. అయితే సుప్రీం తీర్పును బోర్డు వ్యతిరేకిస్తోంది. దీనిపై వారు మాట్లాడుతూ.. ఆడవారిని అనుమతించే విషయంలో మండలిలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవు. దేవాలయ పవిత్రతను, పురాతన సంప్రదాయాలను కాపాడటమే బోర్డు ప్రాథమిక బాధ్యత. అందుకే మేము సుప్రీంకోర్టులో గత తీర్పును సవాలు చేస్తూ అఫిడవిట్ సమర్పిస్తాము," అని వివరించారు.
నిజానికి అనేక పోరాటాల అనంతరం 2018లో శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాక సుప్రీం కోర్టులో పలు పునఃసమీక్ష పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ పిటిషన్లు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నాయి. ఈ క్రమంలో టీడీబీ తన పాత వైఖరిని మార్చుకుని, సంప్రదాయాలకే మొగ్గు చూపాలని నిర్ణయించడంతో మహిళలు ఆలయ ప్రవేశ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
Follow Us