/rtv/media/media_files/2025/06/29/uttar-pradesh-14-year-old-boy-raped-seven-year-old-girl-2025-06-29-12-56-21.jpg)
Minor girl raped in hyderabad
Sexual assault : పదేళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సైదాబాద్‌లో నివసించే ఓ మహిళకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరు బాలుడు, ఒకరు బాలిక. కాగా వారి ఇంటికి సమీపంలోనే ఉండే ఓ యువకుడు ఓ యువకుడు సదరు బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడు.
Also Read: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..రంగంలోకి జాతీయ మహిళా కమిషన్
శనివారం సాయంత్రం ఇంటి వద్ద బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన యువకుడు బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు శనివారం రాత్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: విదేశాల నుంచి భారీగా నిధులు..అక్రమంగా మతమార్పిడులు..చంగూర్‌బాబా కేసులో సంచలన విషయాలు