పుట్టినరోజు నాడే మెడికల్ విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణకు చెందిన యువతి స్నిగ్ధ చదువుకునేందుకు దేశం కాని దేశం వెళ్లింది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో పెర్ఫెక్చువల్ హెల్త్ యూనివర్సిటీలో MBBS రెండో సంవత్సరం చదువుతుంది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ.. స్నిగ్ధ తన బర్త్ డే రోజే ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలిసి స్నిగ్ధ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : డీజీపీపై వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
పుట్టిన రోజు నాడే మృత్యుఒడిలోకి
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన స్నిగ్ధ ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ చదువుకుంటోంది. అయితే స్నిగ్ధ పుట్టిన రోజు నాడు అర్ధరాత్రి సమయంలో ఆమె స్నేహితులు విషెస్ చేప్పడానికి వెళ్ళారు. ఈ తరుణంలో స్నిగ్ధ తన గదిలో ఉరేసుకుని కనిపించింది. దీంతో వెంటనే స్నేహితులంతా భయపడిపోయారు. ఏం జరిగిందో అని ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. వెంటనే స్నిగ్ధ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం తెలియగానే స్నిగ్ధ తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read : ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ కేటుగాళ్ల ఉచ్చు.. రూ.46 లక్షలు గోవిందా!
తమ కూతురి మృత దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఫిలిప్పీ్న్స్ దేశ అధికారులతో సంప్రదింపులు జరపాలని స్నిగ్ధ తండ్రి అమృత్ రావు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా అమృత్ రావు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ పట్టణంలో విద్యుత్ శాఖ డీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Also Read : టేపుతో కట్టేసి.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. ఎముకలు విరగొట్టి.. వెలుగులోకి సంచలన నిజాలు!
విదేశాలలో తెలుగు విద్యార్థుల మృతి
వరంగల్ యువకుడు
ఇది మాత్రమే కాకుండా ఇప్పటికే విదేశాల్లో ఎంతో మంది తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ఇటీవలే లండన్‌లో చదువు కోసం వెళ్లిన వరంగల్ జిల్లా వాసి అనారోగ్యంతో మృతి చెందాడు. వరంగల్‌కు చెందిన దేవులపల్లి ప్రణయ్ ఏడాదిన్నర క్రితం చదువు కోసం లండన్ వెళ్లాడు. అక్కడ అనారోగ్యానికి గురై హాస్పిటల్‌లో చేరాడు. చికిత్స పొందుతూ అక్కడే మృతి చెందాడు.
Also Read : 11వ తరగతి ఖతర్నాక్ కుర్రోడు.. 200 మందిని నిలువునా ముంచేశాడు..!
హనుమకొండ యువకుడు
అలాగే గతంలో హనుమకొండకు చెందిన ఉత్తేజ్ కూడా అమెరికాలోని సెయింట్ లూయిస్ కాలేజీ ఎమ్మెస్ చదువు కోసం వెళ్లాడు. చెరువులో మునిగిపోతున్న తన స్నేహితుడిని కాపాడేందుకు వెళ్లి అతడు గల్లంతయ్యాడు. వెంటనే సహాయక బృందం వెతకగా అతడి మృతదేహం లభ్యమైంది.