Crime: టేపుతో కట్టేసి.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి.. ఎముకలు విరగొట్టి.. వెలుగులోకి సంచలన నిజాలు! లండన్ లో ఏడాది క్రితం ఉర్ఫాన్ షరీఫ్ అనే వ్యక్తి తన కూతురిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి కొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. సుమారు 1 సంవత్సరం తర్వాత బుధవారం (నవంబర్ 13, 2024) కోర్టు విచారణలో షరీఫ్ కూతురిని చంపింది తానేనని అంగీకరించాడు. By Archana 15 Nov 2024 in క్రైం Latest News In Telugu New Update London Incident షేర్ చేయండి London Incident : ప్యాకేజింగ్ టేపుతో కట్టేశాడు.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి కొట్టి అత్యంత కిరాతకంగా కూతురిని చంపాడు ఓ కసాయి తండ్రి. అది ఆ చిన్నారి జీవితంలోనే ఓ ఓ హింసాతంకమైన రోజు.. ఆమె కలలన్నీ ఒక్క క్రికెట్ బ్యాట్ దెబ్బతో మాయమయ్యాయి. ఏడాది క్రితం జరిగిన ఈ కథ వింటే భయంతో చేతులు, కాళ్లు వణకడం ఖాయం..! Also Read : మైనర్ భార్యతో శృంగారంలో పాల్గొన్న అది అత్యాచారమే: బాంబే హైకోర్టు ప్యాకేజింగ్ టేపుతో కట్టేసి.. లండన్ లో ఏడాది క్రితం ఉర్ఫాన్ షరీఫ్ అనే వ్యక్తి తన కూతురిని దారుణంగా హత్య చేశాడు. సుమారు 1 సంవత్సరం తర్వాత బుధవారం (నవంబర్ 13, 2024) కోర్టు విచారణలో షరీఫ్ కూతురిని చంపింది తానేనని అంగీకరించాడు. అంతే కాదు కూతురిని ఎలా చంపాడు అనే విషయాన్ని కూడా కోర్టుకు తెలిపాడు. ఆగస్ట్ 8, 2023న సారాను ప్యాకేజింగ్ టేపుతో కట్టేసి.. క్రికెట్ బ్యాట్ తో కొట్టానని షరీఫ్ కోర్టులో చెప్పాడు. కానీ ఉద్దేశపూర్వకంగా చంపలేదని.. అందుకే శిక్షకు అర్హుడని కాదని చెప్పాడు. ఈ కేసులో న్యాయస్థానం ఇంకా తుది తీర్పును ప్రకటించలేదు. అయితే సారా మృతదేహం దొరికినప్పుడు.. ఆమె శరీరంపై గాయాలు, పంటి గాట్లు, కాలిన గాయాలు ఉన్నాయి. పోస్టుమార్టంలో పక్కటెముక, భుజం, వెన్నెముక సహా 25 ఎముకలు విరిగిపోయినట్లు గుర్తించారు. Also Read : డీజీపీపై వేటు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! ఏడాది క్రితం జరిగింది ఇదే.. మీడియా నివేదికల ప్రకారం.. ఉర్ఫాన్ షరీఫ్, అతని భార్య బీనాష్ బటూల్, కుమార్తె సారా లండన్ లో నివాసం ఉంటున్నారు. అయితే ఉర్ఫాన్ షరీఫ్ ఒక రోజు విచక్షణ కోల్పోయి కన్న కూతురిని కిరాతకంగా చంపాడు. హత్య తర్వాత ఉర్ఫాన్ భార్య బీనాష్ బటూల్ (30), అమ్మాయి మేనమామ ఫైసల్ మాలిక్ (29) మరో 5 మంది పిల్లలతో కలిసి పాకిస్తాన్‌కు పారిపోయాడు. కట్ చేస్తే.. ఆగష్టు 10, 2023 న పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ నుంచి లండన్ పోలీసులకు ఒక ఫోన్ వచ్చింది. కాల్ లో తాను ఉర్ఫాన్ షరీఫ్ నని.. తన కుమార్తె సారా (10 సంవత్సరాలు)ను కొట్టి చంపానని పోలీసులకు చెప్పాడు. సమాచారం తర్వాత లండన్ పోలీసులు వాకింగ్, సౌత్-వెస్ట్ లండన్‌లోని కాలర్ చెప్పిన ఇంటికి వెళ్లారు. ఇంట్లో మంచం పై 10 ఏళ్ల సారా మృతదేహం చూసి కంగుపోయారు. అయితే ఉర్ఫాన్ ఆగస్ట్ 8, 2023 మర్డర్ చేసి పాకిస్థాన్ పారిపోయి.. ఆగష్టు 10, 2023న పోలీసులకు చెప్పాడు. ఉర్ఫాన్ షరీఫ్ పాకిస్థాన్ మూలానికి చెందినవాడు. బ్రిటన్‌లో టాక్సీ నడుపుతూ ఉండేవాడు. ఇంట్లో సారా మృతదేహంతో పాటు పోలీసులకు దొరికిన నోట్ Also Read : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు పోలీసులు మంచం పై సారా మృతదేహంతో పాటు ఒక నోట్‌ను గుర్తించారు. "ఈ లేఖను చూస్తున్న వారెవరైనా, నా పేరు ఉర్ఫాన్ షరీఫ్. నా కూతురిని కొట్టి చంపింది ఎవరు. నేను చాలా భయపడుతున్నాను.. కానీ శిక్షను ఎదుర్కోవడానికి త్వరలో నేను పోలీసులకు సరెండర్ అవుతానని వాగ్దానం చేస్తున్నాను. నేను దేవుడి పై ప్రమాణం చేస్తున్నాను. నా కూతురిని చంపాలని అనుకోలేదు.. కానీ నేను నిగ్రహాన్ని కోల్పోయాను." అని ఆ నోట్ లో ఉంది. తిరిగి లండన్ కు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సారా మృతదేహంతో దొరికిన నోట్ ఆధారంగా.. లండన్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు షరీఫ్ ఇస్లామాబాద్ నుంచి లండన్ తిరిగి రాగానే... 2023 సెప్టెంబర్ 13న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ట్విస్టు.. సారాను హత్య చేసింది భార్య.. ముందుగా కూతురు సారాను చంపింది తానేనని ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉర్ఫాన్ తిప్పికొట్టాడు. అతని భార్య బటూల్ తమ కుమార్తెను హత్య చేసిందని చెప్పాడు. అయితే బటూల్ సారాకు సవతి తల్లి. బటూల్ సారాను హత్య చేసి నేరం ఒప్పుకోమని బలవంతం చేసిందని చెప్పాడు. ఆ తర్వాత బటూల్ తరపు న్యాయవాది ఉర్ఫాన్‌ను విచారించగా.. మళ్ళీ నేరం చేసింది తానేనని ఒప్పుకున్నాడు. సుమారు ఏడాది పాటు ఈ కేసు కోర్టులో విచారణ జరగగా.. 13 నవంబర్ 2024 న కూతురు సారాను చంపింది తానేనని అంగీకరించాడు ఉర్ఫాన్. Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్ #pakistan #ururfan-sharif #taxi-driver #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి