TG Crime: సంగారెడ్డిలో హైటెన్షన్.. స్కూల్ బస్సులో మంటలు.. స్పాట్లో ఐదుగురు స్టూడెంట్స్!

సంగారెడ్డిలో స్కూల్ బస్సులో మంటలు కలకలం రేపింది. విద్యార్థులను ఎక్కించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఆందోళనకు గురయ్యారు విద్యార్థులు, టీచర్లను అప్రమత్తమై బస్సులో నుంచి కిందకు దించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

New Update
Sangareddy Crime News

Sangareddy Crime News

TG Crime: సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో స్కూల్‌ బస్సుకు మంటలు అంటుకున్నాయి.  గురువారం ఉదయం చోటుచేసుకున్న సంఘటన అందరిలోనూ కలకలం రేపింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను ఎక్కించుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది అక్కడున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, బస్ సిబ్బందిలో తీవ్ర ఆందోళనను కలిగించింది. ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు బస్సులోకి ఎక్కుతుండగా కింద భాగంలో అకస్మాత్తుగా స్పార్క్ వచ్చి మంటలు చెలరేగాయి. మంటలు బస్సును చుట్టుముట్టడంతో పిల్లలు భయంతో అరవటం మొదలుపెట్టారు. అయితే వెంటనే అప్రమత్తమైన డ్రైవర్, టీచర్లు పిల్లలను బస్సు నుంచి కిందకు దించారు. 

ఘోర ప్రమాదం తప్పింది:

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలు  అంటుకున్న సమయంలో బస్సులో విద్యార్థులు ఉండటంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించకపోతే అది ఘోర ప్రమాదంగా మారేదని ఫైర్ అధికారులు తెలిపారు. అయితే మంటలు పూర్తిగా వ్యాపించకముందే పిల్లలను కిందికి దింపిన తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది. 

కానీ స్కూల్ బస్సు పాక్షికంగా దగ్ధమైంది. స్కూల్ వాహనాల్లో మెకానికల్ సమస్యలు, భద్రతాపరంగా నిర్లక్ష్యం ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయని పలువురు ఉంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమయానుకూలంగా స్పందించిన డ్రైవర్, టీచర్లు, ఫైర్ సిబ్బంది చొరవ వల్ల పిల్లలందరూ క్షేమంగా బయటపడగలిగారని తల్లిదండ్రులు అంటున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: గుమ్మడికాయ ఏ వ్యక్తులు తినకూడదో తెలుసా..? అది తీవ్రమైన హాని కలిగిస్తుంది

(TG Crime | crime | Latest News | telugu-news)

ఇది కూడా చదవండి: కొత్తిమీర-జీలకర్ర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు