/rtv/media/media_files/2025/07/11/sangareddy-crime-news-2025-07-11-08-11-54.jpg)
Sangareddy Crime News
TG Crime: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పరిశ్రమలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర పేలుడు ఘటన మరొక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అన్నదమ్ములు అఖిలేష్ నిషాంత్ (38), విజయ్‌కుమార్ నిషాంత్ (30) సిగాచీ ఇండస్ట్రీస్‌లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ పేలుడు సమయంలో వారు కూడా ఆ ఫ్యాక్టరీలోనే ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. అప్పటి నుంచి వారి ఆచూకీ గల్లంతైంది. పేలుడు అనంతరం జరిగిన సహాయక చర్యల్లో ఎనిమిది మంది కార్మికులు ఇంకా కనిపించకపోవటంతో వారి జాడ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మేనల్లుళ్ల కోసం ఎదురు చూసిచూసి..
ఈ నేపథ్యంలో స్వగ్రామంలో నివసిస్తున్న అఖిలేష్, విజయ్‌కుమార్‌ల కుటుంబ సభ్యులు నిరంతరం ఆందోళనలో ఉన్నారు. వారి మేనత్త ధీర.. వీరిని చిన్ననాటి నుంచే తన పిల్లలిలా చూసుకున్న మహిళ. సురక్షితంగా తిరిగి వస్తారని ఆశతో ఆమె ప్రతి క్షణం ఎదురు చూస్తూ గడిపింది. కానీ రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ తెలియకపోవటం, అధికారులూ ఎనిమిది మంది ఇంకా కనిపించలేదని, తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఇస్తున్నామని ప్రకటించటం ఆమె మనస్సు తట్టుకోలేక పోయింది. ఎంతగానో ప్రేమించిన మేనల్లుళ్లను కోల్పోయామన్న అనుమానమే ఆమె గుండె ఆగటానికి కారణమైంది. బుధవారం ఆమె ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది.
ఇది కూడా చదవండి: ఒత్తిడిని పెంచే ఐదు ఆహారాలు.. వీటి ఎఫెక్ట్ తెలుసుకోండి
వారి ఆచూకీ తెలుసుకునేందుకు పాశమైలారం వచ్చిన కుటుంబ సభ్యులు మళ్లీ గురువారం స్వగ్రామానికి బయలుదేరారు. మేనత్తకు అంతిమ వీడ్కోలు చెప్పేందుకు. ఒకవైపు పరిశ్రమలో జరిగిన పేలుడు వల్ల ఏర్పడిన శారీరక నష్టాన్ని మించిన భావోద్వేగ గాయాలు మరోవైపు.. మానవ జీవితాల వెనుక ఉన్న కథనాలను బహిర్గతం చేస్తున్నాయి. ఇద్దరు మేనల్లుళ్ల ఆచూకీ కోసం ఎదురుచూస్తూ ఒక మహిళ తన ప్రాణాలు కోల్పోవటం ఈ ఘటన తీవ్రతను మరింత పెంచింది. పరిశ్రమ ప్రమాదాలపై కఠినమైన నియంత్రణలు లేకపోతే.. మరిన్ని అమాయక కుటుంబాలు ఇలాంటి విషాదాలను ఎదుర్కొనే ప్రమాదం ఉండటం బాధాకరం.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ విధంగా రక్షించుకోండి..!!
( Latest News)