TS: వారికే రైతు భరోసా.. మార్గదర్శకాలు విడుదల చేసిన రేవంత్ సర్కార్!

రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా ఇవ్వనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. 

author-image
By Manogna alamuru
New Update
CM Revanth Reddy: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్‌ జీతాలకు నిధులు విడుదల

వ్యవసాయాన్ని పెంచేందుకు, రైతులకు లాభం కూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను అనౌన్స్ చేసింది. రైతులు పెట్టే పెట్టుబడులకు సాయం చేస్తామని చెప్పింది. దీని ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం సాధ్యమవుతుందని భావించింది. దీంతో పాటూ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అనుసరించడానికి, అవసరమైన వనరులు సేకరించడానికి కూడా హెల్ప్ చేస్తామని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి రైతు భరోసాలో మార్పులు చేసింది. 

ఎకరాకు 12 వేలు..

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మారిన రైతు భరోసాను ఈ నెల 26 నుంచి అమలు చేయనుంది. దీనిప్రకారం పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరాకు 12వేలుకు పెంచింది. భూ భారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ భూములున్న వారందరికీ దీనిని ఇవ్వనుంది. అలాగే వ్యవసాయం యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుంచి తొలగించనుంది. ఆర్ఓఎఫ్ఆర్ (ROFR) పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఆర్‌బీఐ నిర్వహించే డీబీటీ (DBT) పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలో జమ చేయనుంది. 

 

 

 

Also Read: HYD: దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు