డెక్కన్ హోటల్ కూల్చివేతలపై దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సివిల్ కోర్టులో ఈ కేసు నడుస్తుండగా.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసిన కారణంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది. వీరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై నిన్న.. 448, 452,458,120 బీ సెక్షన్లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అసలు ఏంటీ కేసు.. నంద కుమార్ అనే వ్యక్తికి చెందిన డెక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థలం వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. కోర్టు విచారణ పూర్తయ్యేవరకూ ఈ హోటల్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు కూడా చెప్పింది. కానీ 2022 నవంబరులో జీహెచ్ ఎంసీ సిబ్బంది.. బౌన్సర్లతో కలిసి దగ్గుబాటి ఫ్యామిలీ హోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు. దాని తరువాత 2024లో మళ్ళీ హోటల్‌ను దగ్గుబాటి కుటుంబం పూర్తిగా కూల్చి వేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్ళారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసు నోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ లు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నంద కుమార్ దాదాపు 3 ఏళ్లుగా పోరాడుతున్నారు. Also Read: TS: తెలంగాణలో నో మోర్ బెనిఫిట్ షోస్, టకెట్ల రేట్ల పెంపు