/rtv/media/media_files/2026/02/08/manchu-vishnu-2026-02-08-10-50-49.jpg)
Police sent notices to manchu vishnu over kidnap case
హిరో మంచు విష్ణుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో ఈ నోటీసులు పంపించారు. విష్ణును విచారణకు రావాలంటూ ఆదేశించారు. ఇటీవల MBUలో ఫీజుల దోపిడీపై విద్యార్థి సంఘాలు నిరసనలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో SFI నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే నటులు మంచు మోహన్ బాబు, ఆయన కొడుకు విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కిడ్నాప్ కేసులో యూనివర్సిటీ పీఆర్‌ఓ సతీశ్‌ను ఏ1గా, ఏ2గా విష్ణు, ఏ3గా మోహన్ బాబు పేర్లను నమోదు చేశారు. ఇప్పటికే PRO సతీష్‌తో పాటు పలువురు బౌన్సర్లను కూడా అరెస్టు చేశారు. దీంతో ఈ కేసును కొట్టివేయాలని మోహన్‌బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. వర్సిటీ యాజమాన్యం ప్రోద్బలంతోనే ఈ కిడ్నాప్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అనిల్ అంబానికి స్వీడన్ మహిళను ఆఫర్ చేసిన ఎప్‌స్టీన్.. వెలుగులోకి సంచలన నిజాలు
Follow Us