RTV Ravi Prakash: ఇది ఎయిర్‌పోర్టా? చేపల మార్కెటా?: RGIAపై రవి ప్రకాష్‌ ట్వీట్ వైరల్!

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్వహణ చేపల మార్కెట్ కన్నా దారుణంగా ఉందని రవి ప్రకాష్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఉదయం ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కన్వేయర్ బెల్ట్ మా అమ్మమ్మ కన్నా కూడా నెమ్మదిగా ఉందంటూ సెటైర్లు వేశారు.

New Update
RTV Ravi Prakash

రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(rajiv-gandhi-international-airport) నిర్వహణ చేపల మార్కెట్ కన్నా దారుణంగా ఉందని రవి ప్రకాష్(ravi prakash latest) ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఉదయం ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కన్వేయర్ బెల్ట్ మా అమ్మమ్మ కన్నా కూడా నెమ్మదిగా ఉందంటూ సెటైర్లు వేశారు. ఏరో బ్రిడ్జ్‌లో ఎయిర్ కండిషనింగ్ (AC) లేదని తెలిపారు. ప్లాస్టిక్ ట్రేల కొరత ఉందన్నారు. ప్రతీ రోజు ఇలానే గందరగోళం ఉంటుందని సెక్యూరిటీ సిబ్బంది తనతో చెప్పారని రవిప్రకాష్ పేర్కొన్నారు. 'ఫైన్ ఫ్లై ప్రీమియం, స్వెట్ డీలక్స్'.. మీ బిజినెస్ మోడల్ ఇదేనా? అని ఎయిర్‌పోర్ట్ ను నిర్వహిస్తున్న GMR సంస్థను ఆయన ప్రశ్నించారు.

Also Read :  ఇక KCR ఫొటో పెట్టుకోను.. కవిత సంచలన ప్రకటన!

Also Read :  టార్గెట్ నవీన్ యాదవ్.. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అస్త్రం ఇదేనా?

స్పందించిన అధికారులు..

రవి ప్రకాష్‌(ravi prakashrtv) ట్వీట్ కు ఎయిర్పోర్ట్ అధికారులు స్పందించారు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. తాము అందించాలనుకుంటున్న సర్వీస్ స్థాయి ఇది కాదన్నారు. ఈ అంశంపై దృష్టి సారిస్తామన్నారు. ఈ విషయాన్ని సంబంధిత టీమ్ లకు పంపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎయిర్‌పోర్ట్ చేసిన పోస్టుకు రవి ప్రకాష్ స్పందించారు.. దయచేసి మాకు మరిన్ని ప్లాస్టిక్ ట్రేలను అందించాలన్నారు. ఈ గందరగోళం నుంచి మమ్మల్ని బయట పడేయండి అని పేర్కొన్నారు. ప్రయాణికుల కోసం సెక్యూరిటీ ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు.

అనేక మంది ప్రయాణికులు కూడా రవిప్రకాష్‌ ట్వీట్ కు స్పందించారు. ఎయిర్‌పోర్ట్ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ అనుభవాలను పంచుకున్నారు. అనేక ఫిర్యాదులు ఉన్నా.. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ RGIAకు అవార్డులు ఎలా ఇస్తుందో తనకు అర్థం కావడం లేదని ఓ ప్రయాణికుడు కామెంట్ పోస్ట్ చేశారు. సీఆర్పీఎఫ్‌, కస్టమ్స్ అధికారులు తనిఖీల పేరుతో ప్రయాణికులను వేధిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది ఎయిర్పోర్ట్ కాదు ఎంజీబీఎస్ బస్టాండ్ అని మరో ప్రయాణికుడు కామెంట్ చేశారు. ఇటీవల తమను ఫ్లైట్ రెడీ కాలేదంటూ.. ఎయిరో బ్రిడ్జి మీద వెయిట్ చేయించారని మరో ప్రయాణికుడు వాపోయారు. 

Advertisment
తాజా కథనాలు