లక్షల్లో డబ్బు.. ఎక్కడిదో తెలియదు.. ఓ ముగ్గురు వ్యాపారులు స్కూటీపై తరలిస్తున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు వ్యాపారులు డబ్బు తరలిస్తున్న ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఆ వ్యాపారులు దాదాపు రూ.22 లక్షలు తీసుకుని స్కూటీపై అటువైపుగా వచ్చారు.
Also Read: 'మెకానిక్ రాకీ' రివ్యూ.. విశ్వక్ యాక్షన్, కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
తనిఖీలో భాగంగా పోలీసులు వారిని ఆపి స్కూటీలో ఉన్న బ్యాగును తనిఖీ చేశారు. అందులో ఉన్న డబ్బును చూసి షాక్ అయ్యారు. ఇంత డబ్బు ఎక్కడదని ప్రశ్నించారు. కానీ వారి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. పత్రాలు ఏమైనా ఉన్నాయా అని అడిగినా.. నోరు మెదపలేదు.
Also Read: జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు!
బిక్కు బిక్కుమంటూ కళ్లు తేలేసారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు డబ్బుతో పాటు స్కూటీ, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కోఠిలో జరిగింది. సుల్తాన్ బజార్ సీఐ శ్రీనివాస చారి చెప్పిన వివరాల ప్రకారం..
Also Read: ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ భయం అవసరం లేదు!
బ్యాగులో రూ.22 లక్షలు
మొఘల్ పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖయుమ్, సుల్తాన్ బజార్‌కు చెందిన ఉత్తమ్ కుమార్, లలిత్ సింగ్. వీరు ముగ్గురు వ్యాపారులు. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వీరు ముగ్గురు కలిసి అనుమానాస్పదంగా ఓ బ్యాగ్‌ను యాక్టివాపై తీసుకెళ్లారు. ఇక హవాలా డబ్బు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు ముందుగానే కోఠిలోని గుజరాత్ గల్లీలో బుధవారం తనిఖీలు చేపట్టారు.
Also Read: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. !
ఇందులో భాగంగానే ఆ ముగ్గురు తరలిస్తున్న యాక్టివాని పోలీసులు ఆపి తనఖీ చేశారు. బ్యాగ్‌లోని రూ.22 లక్షలు చూసి షఆక్ అయ్యారు. ఆ డబ్బుకు సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అని అడిగినా వారి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో పత్రాలు లేకపోవడంతో ఆ డబ్బును సీజ్ చేశారు. దాంతో పాటు యాక్టివాను, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం డబ్బును ఇన్‌కమ్ టాక్స్ అధికారులకు అప్పగించారు.