TG: జనవరిలోనే పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఖరారు! తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ రెడీ చేసింది. డిసెంబర్ చివరి వారంలోగా కులగణన సర్వే లెక్కలు పూర్తి చేసి సంక్రాతి తర్వాత ఎలక్షన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. By srinivas 22 Nov 2024 | నవీకరించబడింది పై 22 Nov 2024 08:55 IST in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి TG: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ రెడీ చేసింది. డిసెంబర్ చివరి వారంలోగా కులగణన సర్వే లెక్కలు పూర్తి చేసి సంక్రాతి తర్వాత ఎలక్షన్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సంక్రాతి తర్వాతే ఎన్నికలు.. ఈ మేరకు రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వచ్చె నెలలో హియరింగ్ ఉంది. దీంతో డిసెంబర్ రెండో వారం కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేసి జనవరిలో ఎన్నికలు కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. కులగణన సర్వే వివరాలు రాగానే వాటిని డెడికేటెడ్ కమిషన్ కు అందించనుంది. అందులోని వివరాలు, కమిషన్ చేసిన అధ్యయన నివేదిక రెండింటి ఆధారంగా రిజర్వేషన్లను ఎంతమేరకు పెంచాలనే దానిపై ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఇందులో భాగంగానే రిజర్వేషన్లను ఖరారు చేసి.. ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ చివరిలోగా పూర్తి కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: TG: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. ! ఇదిలా ఉంటే.. డిసెంబర్ చివరలో షెడ్యూల్ రిలీజ్ చేసి సంక్రాంతి పండుగ తర్వాత పోలింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం. 4 నుంచి 5 వేల గ్రామాలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో ఎన్నికలు పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకుని, గ్రామాలు, వార్డుల వారీగా పబ్లిష్ చేసింది. షెడ్యూల్ రిలీజ్ కంటే ముందు మరోసారి సప్లిమెంటరీ ఓటర్ల జాబితాను తీసుకోనుంది. సర్పంచుల పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. కాగా ఫిబ్రవరి 1 నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో జీపీలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. రైతుల నుంచి గుంజుకున్న భూములపై విచారణ! ఇది కూడా చదవండి: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ఇది కూడా చదవండి: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. ! #panchayat election schedule #telangana #panchayat-election మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి