'మెకానిక్ రాకీ' రివ్యూ.. విశ్వక్ యాక్షన్, కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?

విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ మూవీ ఇవాళ రిలీజ్ కాగా రివ్యూ వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, రొమాంటిక్ సీన్లతో మెల్లగా సాగింది. ట్విస్ట్‌లు ముందుగానే ఊహించేలా ఉన్నాయి. సెకండాఫ్ సినిమాకి ప్లస్ పాయింట్. ప్రతి పాత్ర సెకండాఫ్‌లో ఫుల్ జోష్ నింపుతుంది.

New Update
Mechanic Rocky

విశ్వక్ సేన్ హీరోగా ఈ ఏడాదిలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా అలరించాడు. ఈ సినిమాలకి సూపర్ డూపర్ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తెరకెక్కించిన ‘మెకానిక్ రాకీ’తో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా? లేదా? అనే విషయానికొస్తే.. 

Also Read: ఐదు బ్యాంకుల మీద కొరడా ఝళిపించిన ఆర్బీఐ..భారీ జరిమానా

కథ:

విశ్వక్ సేన్ ఇందులో రాకేష్ (రాకీ) పాత్రను పోషించాడు. ఇందులో అతడు ఒక హైదరాబాద్ కుర్రాడు. బీటెక్ చదువుతున్న సమయంలోనే తన ఫ్రెండ్ సిస్టర్ ప్రియ (మీనాక్షి చౌదరి)తో ప్రేమ వ్యవహారం ఒకటుంటుంది. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో రాకీ మధ్యలోనే కాలేజీ మానేస్తాడు. అతడి తండ్రి రామకృష్ణ (నరేష్) నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా సెటిల్ అవుతాడు. 

Also Read: రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ

మెకానిక్ గానే కాకుండా డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. అదే సమయంలో రంకిరెడ్డి (సునీల్) కన్ను ఆ గ్యారేజీ మీద పడుతుంది. అలాగే డ్రైవింగ్ నేర్చుకోవడంతో కోసం మాయ (శ్రద్ధా శ్రీనాథ్), ప్రియా (మీనాక్షి చౌదరి) ఆ గ్యారేజీకి వస్తారు. ఓ వైపు గ్యారేజ్ కాపాడుకోవడం కోసం రాకీ ఏం చేశాడు. మరోవైపు తను కాలేజీ టైంలో ప్రేమించిన ప్రియా మళ్లీ తన గ్యారేజీకి రావడంతో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. గ్యారేజీ కాపాడుకున్నాడా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read: అదానీకి వరుసగా షాక్‌లు..కెన్యా ఒప్పందాలు రద్దు

విశ్లేషణ:

చూడ్డానికి ఈ కథ ముక్కోణపు ప్రేమకథలా అనిపిస్తుంది. సినిమా మొదట్లో సన్నివేశాలన్నీ రొమాంటిక్, కామెడీ సీన్లతో నిండి ఉంటుంది. అలా చూడగా చూడగా.. జానర్ మారిపోయిన అనుభూతి కలుగుతుంది. స్టోరీలో ఇంకేదో ఉందన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంటర్వెల్ ముందు వరకు పెద్దగా ఏం అనిపించదు. వావ్ అనే మూమెంట్ కనిపించదు. ముందు జరిగేది తెలిసేలా ఉండటంతో మజా పోతుంది. 

ఫస్ట్ హాఫ్‌లో కథ మెల్లగా సాగుతుంది. కామెడీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ట్విస్ట్‌లు కూడా ముందుగానే ఊహించేలా ఉండటంతో కాస్త మైనస్ అనే చెప్పాలి. కానీ టీజర్, ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాల కంటే సినిమాలో అంతకు మించి అనేటటువంటి సన్నివేశాలు బాగా థ్రిల్లింగ్ అనిపిస్తాయి. 

Also Read: హిట్ మ్యాన్, టీమ్ ఇండియా కెప్టెన్ వచ్చేస్తున్నాడు..

అయితే ప్రస్తుత యువతకి ఈ సినిమా ఫుల్ జోష్‌నిస్తుంది. అయితే సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు గుస్ బంప్స్ తెప్పిస్తాయి. ప్రతి పాత్ర కొత్త మలుపునకు నాంది పలుకుతుంది. అప్పటి వరకు సాగిన కథ ఒకలా ఉంటే.. సెకండాఫ్‌లో వచ్చే సీన్లు మరో రేంజ్‌లో ఉంటాయి. 

ఎవరెలా చేశారు:

విశ్వక్ సేన్ ఎప్పటిలాగే తన స్టైల్లో దుమ్ము దులిపేశాడు. హుషారైన యాక్టింగ్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇక మీనాక్షి, శ్రద్ధా శ్రీనాథ్‌కు అద్భుతమైన పాత్రలు దక్కాయి. వాళ్ల పాత్రలకు ప్రాధాన్యం లభించింది. ఎక్కువగా శ్రద్ధా పాత్ర ఆకట్టుకుంది. అలాగే సునీల్, హర్ష చెముడు, నరేష్ సహా మరికొందరి యాక్టింగ్ బాగుంది. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ వావ్ అనిపించింది. కెమెరా విభాగం కూడా చాలా బాగా పనిచేసింది. మొత్తంగా సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు