TG: కలెక్టర్ పై దాడి కేసులో కేసీఆర్, కేటీఆర్.. రూ.10 కోట్ల ఖర్చు.. ! లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ రూ.10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. By Bhavana 22 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Telangana: లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ రూ.10 కోట్లు విడుదల చేశారని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టుకు వివరాలను, సాక్ష్యాలను అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో ఏ-1గా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణను కొనసాగించాలని తెలిపింది. Also Read: Hyderabad: అమెరికాలో సొంత తుపాకీ పేలి హైదరాబాద్ యువకుడి మృతి! ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్‌రావు వాదనలను ధర్మాసనం ముందు వినిపించారు. ‘‘భూసేకరణకు అడ్డుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో ఏదైనా తప్పు ఉన్నా.. ఏం కాదు. మన వెనుక పెద్దలు కేసీఆర్, కేటీఆర్ ఉన్నారంటూ ఈ కేసులో ఏ-1గా ఉన్న పిటిషనర్ నరేందర్‌రెడ్డి ఓ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. Also Read: AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి అతి భారీ వర్షాలు! విచారణ కోసం వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులను హత్య చేసేందుకు నిందితులు కుట్రలు చేసినట్లు సమాచారం. కలెక్టకర్ వచ్చిన వెంటనే.. ఎలాంటి చర్చలు, సంభాషణలు జరగక ముందే.. నిందితులు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. హత్య చేయాలనే ముందస్తు ప్రణాళిక ఉన్నందునే.. కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఏ-2 సురేశ్ గ్రామంలో స్థానికంగా ఉండడంలేదు. అతడు ఓ యూట్యూబర్. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. Also Read: TG:తాగినోళ్లకు తాగినంత...మందుబాబులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే ఆఫర్! నరేందర్ రెడ్డి పంపడం వల్లే సురేశ్ అక్కడికి వెళ్లారు. భూసేకరణలో సురేశ్ భూమి లేదు. హత్య కుట్రలో నరేందర్‌రెడ్డిది కీలక పాత్ర. నిందితులు కూడా తమ వెనక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని ధీమాగా చెప్పుకున్నారని’’ అని కోర్టుకు వివరించారు. కలెక్టర్ హత్యకు కుట్ర ద్వారా భూసేకరణ ప్రక్రియను భగ్నం చేసి.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నది నిందితుల వ్యూహమని తెలిపారు. వచ్చేది కలెక్టర్ అయినా.. తహసీల్దార్ అయినా.. దాడి చేయాలంటూ పిటిషనర్ ముందుగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ‘‘లగచర్ల దాడి ఘటనకు 15 రోజుల ముందే నిందితులకు పిటిషనర్ భరోసా ఇవ్వడమే కాకుండా.. 84 ఫోన్‌కాల్స్ మాట్లాడారు. Also Read: TS: ఎన్నికలకు సిద్ధంకండి..డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగువ కోర్టు రిమాండ్ ఆదేశాలను కొట్టేయాలని, ఇంటి భోజనం కావాలని, జైలులో ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని, పలు ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని.. ఇలా పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ క్రమంలో పిటిషనర్ సమర్పించిన అఫిడవిట్‌లో తనను కేబీఆర్ పార్క్ వద్ద అరెస్టు చేశారని స్వయంగా చెప్పారు’’ అని పీపీ తెలిపారు. ఈ మేరకు నరేందర్‌రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పెన్‌డ్రైవ్‌లో కోర్టుకు అధికారులు ఇచ్చారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు ధర్మాసనం ముందు వినిపించారు. తన క్లైంట్‌ను 15 మంది పోలీసులు కేబీఆర్ పార్కులో కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ‘డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్‌బెంగాల్’ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని.. ఆ సమాచారం డ్రైవర్‌కు ఇవ్వడం ఏంటని ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ఫొటోలను హైకోర్టుకు సమర్పించారు. వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. పిటిషనర్ తన ఎదుట ఉన్న లీగల్ రెమిడీస్ ప్రకారమే పిటిషన్లు వేస్తున్నారని.. అది పిటిషనర్ హక్కు అని తేల్చి చెప్పింది. పోలీసులు కీలక ఆధారాలను సేకరించడంలో విఫలమవుతున్నారని.. ఘటన జరిగిన నాటి నుంచి అరెస్టు వరకు పోలీసులు ఏం దర్యాప్తు చేశారు? ఏం ఆధారాలు సేకరించారని నిలదీసింది. డిప్యూటీ కలెక్టర్‌కు తీవ్రమైన గాయాలు అయినట్లు పేర్కొంటున్నా.. డాక్టర్ రిపోర్ట్ అనుమానాలను రేపుతుంది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. ఒకే నేరానికి వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారంటూ నరేందర్‌రెడ్డి భార్య పట్నం శ్రుతి హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ సైతం జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు రాబోతుంది. #ktr #kcr #Vikarabad farmers attack #lagacharla issue #Collector Attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి