/rtv/media/media_files/2025/04/14/fLzwPvrTvboLB4A2xoit.jpg)
Rowdy sheeter murdered
Falaknuma murder : హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా ప్రాంతంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది.రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ మాస్ యుద్దీన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి విచక్షణ రహితంగా నరికి హతమార్చారు.నిన్న (ఆదివారం) అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన మాస్ యుద్ధీన్ అక్కడిక్కడే మృతి చెందాడు.
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
నడిరోడ్డుపై ఓ వ్యక్తి కత్తిపోట్లతో ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని వ్యక్తిని పరిశీలించగా.. అతడు రౌడీషీటర్ మాస్ యుద్ధీన్‌గా గుర్తించారు. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.మూడురోజుల క్రితమే వివాహితుడైన యుద్దీన్, కొత్త జీవితాన్ని ప్రారంభించిన క్రమంలోనే ఈ అకాల మరణం అతని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది.
Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి
గుర్తుతెలియని దుండగులు ముందుగానే పక్కా పథకం ప్రకారం యుద్దీన్‌ను లక్ష్యంగా చేసుకుని కత్తులతో దాడికి పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు.తీవ్రంగా గాయపడిన అతను ఘటనాస్థలంలోనే రక్తపు మడుగులో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించడంతో పాటు, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ నిందితుల గుర్తింపు కోసం చర్యలు తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.ఈ హత్య ఘటనతో ఫలక్‌నుమాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.