BREAKING: కులగణనపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు TG: కులగణనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. By V.J Reddy 03 Nov 2024 | నవీకరించబడింది పై 04 Nov 2024 07:03 IST in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి CM Revanth: కులగణనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపటిలోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మరోసారి స్పష్టం చేశారు సీఎం. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్న అన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు రేపటి లోగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఇది కూడా చదవండి: జగన్ సంచలనం.. బీజేపీకి వ్యతిరేకంగా పోరు బాట! స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి తన నివాసంలో సమాలోచనలు జరిపారు. ఇది కూడా చదవండి: అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు! ఈనెల 6వ తేదీ నుంచి... తెలంగాణలో ఈ నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కుల సర్వే ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను రేపటిలోగా జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు కుల గణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ఇటీవల హైకోర్టు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పున:సమీక్షించింది. అందరి ఏకాభిప్రాయంతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. ఇది కూడా చదవండి: 85 లక్షల వాట్సప్ అకౌంట్స్ బ్లా క్! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి