త్వరలో కొత్త ఎనర్జీ పాలసీ.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ నిపుణులు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని నూతన పాలసీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Batti 2

త్వరలో నూతన విద్యుత్ పాలసీని తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ పాలసీతో పాటు అన్ని వర్గాలకు ఉపయుక్తంగా ఉండేలా రూపకల్పన జరుగుతోంది. ఇందుకోసం విద్యుత్ రంగంలో నిపుణులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టత ఇచ్చారు. త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీని తీసుకొస్తామని తెలిపారు. విద్యుత్ నిపుణులు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని నూతన పాలసీని ప్రకటిస్తామని పేర్కొన్నారు. 

Also Read: హైదరాబాద్‌లో ఎత్తైన గాంధీ విగ్రహం.. గాంధీ మునిమనుమడు సంచలన వ్యాఖ్యలు

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో రూ.35 వేల కోట్లతో చేపట్టిన వైటీపీఎస్‌ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కొమటిరెడ్డిలు సందర్శించారు.  యదాద్రి పవర్ ప్లాంట్‌కు రామగుండి నుంచి సరఫరా అయ్యే బొగ్గు గూడ్స్‌ వ్యాగిన్‌కు జెండా ఊపి ప్రారంభించారు. అలాగే పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్‌ను కూడా ప్రారంభించారు. 

ఇప్పటికే సెప్టెంబర్ 11న రెండవ యూనిట్‌ సింక్రనైజేషన్‌ను ప్రారంభించారు. అయితే రాష్ట్ర అవసరాలకు అనుగుణంగానే ఈ నూతన పాలసీని తీసుకురానున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. 2034-35 నాటికి రాష్ట్రంలో 31,809 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌కు అవకాశం ఉందన్నారు. దీనికి అనుగుణంగా విద్యుత్ ఉత్పాదకతను పెంచుతామని చెప్పారు. అలాగే రాష్ట్ర అవసరాలకు కొరత లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు.  

Also Read: అఘోరీ సంచలన నిర్ణయం.. నన్ను అవమానించారు, ఇక చూస్కోండి!

మరోవైపు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి సంప్రదాయేతర ఇంధన వనరులు ద్వారా 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్స్ తయారుచేస్తున్నామని భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ ద్వారా 2025 మే నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రీడ్‌కు అనుసంధానం చేస్తామని అన్నారు. 

Also Read: ఎటు వెళ్తోందీ సమాజం.. ఇది ఎంత వరకు సమంజసం!? సజ్జనార్‌ ఫైర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు