మంత్రికి పదవి గండం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు TG: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పదవి గండం ఉందని అన్నారు. కాగా ఇటీవల ఆయనపై ఈడీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఏలేటి వ్యాఖ్యలతో మంత్రి పొంగులేటి అరెస్ట్ అవుతారా? అనే చర్చ జోరందుకుంది. By V.J Reddy 03 Nov 2024 in తెలంగాణ నిజామాబాద్ New Update షేర్ చేయండి Alleti Maheshwar Reddy: బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పదవి గండం ఉందని అన్నారు. కాగా ఇటీవల ఆయనపై ఈడీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మహేశ్వర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అనేక చర్చలకు దారి తీసింది. అయితే పొంగులేటిని ఈడీ అరెస్ట్ చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కూడా చదవండి: జగన్ సంచలనం.. బీజేపీకి వ్యతిరేకంగా పోరు బాట! హామీలను అమలు చేయకుండా... ఈరోజు హనుమకొండలో పర్యటించారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అనంతరం అక్కడ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకంపనలు పుట్టించే వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ పక్కన పెడుతుందని జోస్యం చెప్పారు. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు అమలు చేసేందుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. ఇది కూడా చదవండి: అలిగిన టీడీపీ ఎంపీ.. మంత్రులు ఆపిన ఆగలేదు! ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడం కామెడీగా ఉందని సెటైర్లు వేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో సీఎం రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంకి, మంత్రులకు మధ్య సఖ్యత లేదని, తెలంగాణలో కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని హామీలతో పాలన సాగిస్తోందని విమర్శించారు. ఇది కూడా చదవండి: జమ్మూ కశ్మీర్‌లో మరో పేలుడు.. 12 మందికి తీవ్ర గాయాలు సీఎం మారుతుండు అంటూ... ఇటీవల రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం మానేశాడన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇప్పటికే ఏడు సార్లు రాహుల్ గాంధీ రేవంత్ అపాయింట్మెంట్ తిరస్కరించాడన్నారు. చివరికి కేరళలో ప్రియాంక గాంధీ కూడా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. రేవంత్ హాలిడే పీరియడ్ అయిపోయిందన్నారు. ఇక ఆయనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. 2025 జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా రాష్ట్రానికి కొత్త సీఎం రావచ్చని బాంబు పేల్చారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కొత్త సీఎం వేటలో పడిందన్నారు. మూసీ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ హైకమాండ్ భావించిందన్నారు. ఇది కూడా చదవండి: 85 లక్షల వాట్సప్ అకౌంట్స్ బ్లా క్! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి