Jubilee Hills By Election : జూబ్లీహిల్స్‌లో రిగ్గింగ్‌ జరిగింది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు హాట్ కామెంట్స్

ఇటీవల జరిగిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ రెండు పార్టీలు రిగ్గింగ్ కు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు.

New Update
FotoJet (90)

BJP state president N Ramachandra Rao

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు బీఆర్ఎస్ కష్టపడిందన్నారు. కాంగ్రెస్ గెలవకపోతే బీఆర్ఎస్ నేతలు జైలు కు పోతారనే భయంతోనే కాంగ్రెస్ గెలిచేలా బీఆర్‌ఎస్ కృషి చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ కు మధ్యవర్తిగా ఎంఐఎం వ్యవహరిస్తోందన్నారు. మూడు పార్టీలు ఒక్కటే అని రామచంద్రరావు ఆరోపించారు. ఇక బీహార్ లో అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారన్న ఆయన ఎన్డీఏ కూటమి గెలవబోతుందని స్పష్టం చేశారు.

Also Read :  తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల

Advertisment
తాజా కథనాలు