/rtv/media/media_files/2025/01/31/gyLqlOsBC4iaUCitsT0g.jpg)
Revanth Reddy Vs KCR
స్వల్ప అనారోగ్య సమస్యలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు(గురువారం) సోమాజీగూడ యశోద హాస్పిటల్‌కు వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. డాక్టర్లను కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా కేసీఆర్ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తెలుసుకున్నారు. చంద్రశేఖర్ రావుకు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.