/rtv/media/media_files/2025/07/25/cm-revanth-2025-07-25-09-07-34.jpg)
CM Revanth
Telangana: రాఖీ(Raksha Bandhan 2025) పండుగ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారత కోసం అదిరిపోయే న్యూస్‌ను తీసుకొచ్చారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారతను ప్రోత్సహించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి:Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
ఆర్థికంగా వారిని ప్రోత్సహించేందుకు..
ఈ పథకం కింద మహిళలకు 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. అయితే ఇందులో 1,000 మెగావాట్లు వరకు మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి అవుతాయని తెలిపారు. సాధారణంగా ఒక్కో మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే సుమారుగా రూ.3 కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో 10 శాతం మహిళా సంఘాలు భరిస్తాయి. మిగిలిన 90 శాతం బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో ఇస్తారని ప్రభుత్వం తెలిపింది. మహిళా సంఘాలు రుణాల చెల్లింపులో 99% వరకు మంచి ట్రాక్ రికార్డు ఉన్నట్లు తెలుస్తోంది.
రుణాలు అందించేందుకు..
దీనివల్ల ఈ రుణాలను బ్యాంకులు అందించేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కోసం ప్రభుత్వం దేవాదాయ, ప్రభుత్వం, నీటి పారుదల శాఖలో ఉన్న భూములను ఉపయోగించనుంది. ఈ సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విక్రయించడం ద్వారా మహిళా సంఘాలకు ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఒక్కో మెగావాట్ సోలార్ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి సుమారుగా రూ.30 లక్షల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఇది కూడా చూడండి:KTR vs Bandi Sanjay : బండి సంజయ్‌కి 48 గంటల డెడ్‌లైన్.. సారీ చెప్పకపోతే అంతే...కేటీఆర్ వార్నింగ్
రద్దీ ఎక్కువ ఉండటంతో స్పెషల్ బస్సులు..
ఇదిలా ఉండగా రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. పండుగ సందర్బంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇవి ఈ నెల 11వ తేదీ వరకు నడుస్తాయని ఆర్టీసీ తెలిపింది. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఛార్జీలు పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. దీనికి ఓ ముఖ్య కారణం ఉంది. చాలా ప్రాంతాల్లో బస్సులు లేవు. రాఖీ సందర్భంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఎక్కువ బస్సులు తీసుకురావాలి. దీనివల్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ కారణంగా కేవలం స్పెషల్ బస్సులో ఛార్జీలు పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. కేవలం మూడు రోజులు మాత్రమే అధిక ధరలు ఉంటాయి. ఆ తర్వాత సాధారణ ధరలే ఉంటాయని తెలంగాణ ఆర్టీసీ స్పష్టం చేసింది.