IAS: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్.. చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్! స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు ఈ కమిషన్‌కు చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 05 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి BC Commission: త్వరలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావును ఈ కమిషన్ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ కమిషన్ కు కార్యదర్శిగా బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి.సైదులు ఉండనున్నారు. Also Read : క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR డిసెంబర్ లో ఎన్నికలు... రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీల వెనకబాటుతనం, స్వభావం, చిక్కులపై లోతైన సమకాలీన అధ్యయనం చేయాలని, రాజ్యాంగంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి స్థానిక సంస్థల వారీగా దామాషా పద్ధతిలో కల్పించాల్సిన రిజర్వేషన్లను ప్రతిపాదించాలని కమిషన్‌కు రేవంత్ సర్కార్ సూచించింది. నెల రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని కమిషన్‌కు స్పష్టం చేసింది. కాగా ఈ డిసెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. Also Read : హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..! Also Read : గుజరాత్‌లో దారుణం.. ఊపిరాడక కారులో నలుగురు చిన్నారులు Also Read : USA Elections 2024: ఇండియన్ల మద్దతు ట్రంప్‌కేనా..? 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి... బూసాని వెంకటేశ్వరరావు 1993 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2019 డిసెంబరు 31న రిటైర్డ్ అయ్యారు. కాగా 1987 గ్రూప్-1 పరీక్షలో టాపర్‌గా నిలిచారు. ఆ తరువాత ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పాటు తర్వాత సర్వీసు విషయాలు, శిక్షణ, ఎన్నికలు, కార్యాచరణ ప్రణాళికలు, పరిపాలన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకంగా ఉన్నారు. కాగా రెవెన్యూ శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఆయన పదవీ విరమణ చేశారు. కాగా తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సేవలను మరోసారి వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమైన స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కమిషన్ బాధ్యతను ఆయనకు అప్పగించింది. #ias #bc-commission #busani-venkateswara-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి