/rtv/media/media_files/2025/03/06/H5s40ki40TADYE3lieCh.jpg)
MLC Elections
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కాషాయ జెండా రెపరెపలాడింది. పెద్దల పోరులో అధికార పార్టీ కాంగ్రెస్ కాకుండా బీజేపీ గెలిచింది. దీనికి కారణం మొదటి నుంచీ బీజేపీ చేస్తున్న గ్రౌండ్ వర్కే అంటున్నారు. క్షేత్ర స్థాయి నుంచి బీజేపీ కష్టపడిందని తెలుస్తోంది. మామూలు ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలుండవు. పట్టభద్రుల ఎన్నికలకు ఎప్పటికప్పుడు ఓట్లు నమోదు చేసుకోవాల్సిందే. తెలంగాణలో పట్టు సాధించాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న బీజేపీ ఈ ఎలక్షన్స్ ను బాగా వాడుకుంది. ఎన్నికల తేదీలను ప్రకటించక ముందే ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల నమోదును చేయించడమే కాకుండ క్షేత్రస్థాయి నుంచే బాగా ప్రచారం చేసింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రచారపర్వంలో పట్టభద్రులు, ఉద్యోగుల సమస్యలపై తాము పోరాడిన తీరుని తెలియజెబుతూ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఆత్మీయ సదస్సులు, ర్యాలీలు నిర్వహించడంతోపాటు భాజపా ముఖ్యనాయకులు ఎక్కడకిక్కడ ప్రతి 25 మంది ఓటర్లకు ఒకరిని బాధ్యులుగా నియమించి విజయపథంలో నడిపించారు. వీటన్నిటితో పాటూ సోషల్ మీడియాలో కూడి విస్తృతమైన ప్రచారాన్ని చేసింది బీజేపీ.
కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ..
ఆరేళ్ల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఓడిపోయింది. దానికి కారణం పట్టభద్రుల ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్ తీసుకోకపోవడమే కారణమని చెబుతున్నారు. తప్పనిసరి గెలవాలని అధిష్టానం పీసీసీకి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పినా కూడా ఓటమి తప్పలేదు. దీనికి అనేక కారణాలున్నాయని అంటున్నారు. మొదటిది అభ్యర్థి ఎంపికలో ఆలస్యం జరగడం. దాని తరువాత ముందు నుంచి అనుకున్నవారికి కాకుండా చివరి క్షణంలో మరొకరికి సీటు ఇవ్వడం కూడా పార్టీకి నష్టం కలిగించిందని తెలుస్తోంది. దాంతో పాటూ క్షేత్రస్థాయి నుంచి ప్రచారం చేయడంలో కాంగ్రెస్ విఫలం అయింది. సోషల్ మీడియా ప్రచారాన్ని కూడా పట్టించుకోలేదు. పోలింగ్ కు కొద్ది రోజుల ముందు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి మూడు చోట్ల ప్రచారం నిర్వహించారు. అయితే ఇవి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. దాంతో పాటూ ఉద్యోగులకు, రిటైరైన వారికి బిల్లుల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వం బాగా ఆలస్యం చేస్తుండటం కూడా విద్యావంతుల్లో అసంతృప్తి ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. బీజేపీకి నలుగురు ఎంపీలుండటం, వారిలో ఒకరు కేంద్రమంత్రి కూడా అవడంతో పోటీ గట్టిగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి చాలా ముందే సూచించారని...ఎక్కడికక్కడ పార్టీ స్థానిక శ్రేణులతో కలసి వ్యూహం రచించాలని చెప్పారని..కానీ ఎవరూ శ్రద్ధతో పనిచేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దాని ఫలితమే ఈ ఓటమి అంటున్నారు.
Also Read: Canada: అమెరికాకు కరెంట్ కోతలు తప్పవని కెనడా హెచ్చరిక