కవితకు బెయిల్ ఎలా వచ్చిందో మాదగ్గర ఆధారాలున్నాయి.. పొంగులేటి ! రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దొరపాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. కవితకు బెయిల్ ఎలా వచ్చిందో తమ దగ్గర ఆధారాలున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. By srinivas 11 Nov 2024 | నవీకరించబడింది పై 11 Nov 2024 17:09 IST in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Ponguleti: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా తమ ప్రభుత్వం అప్పులు కడుతూనే సంక్షేమ పథకాలు అందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలని రైతు రుణమాఫీ కూడా చేసిందని, 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ఖమ్మం రూరల్ మండలం చిన్నవెంకటగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పొంగులేటి.. గత దొరపాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, పార్టీ నాయకులు జారిపోతారానే భయంతో మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని వారిని మభ్యపెడుతున్నారని విమర్శించారు. అలాగే కవితకు బెయిల్ ఎలా వచ్చిందో మాదగ్గర ఆధారాలున్నాయంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బ్లూ డ్రెస్‌లో ఈ ప్రపంచ సుందరిని చూస్తే చెమటలు పట్టాల్సిందే! కేంద్ర మంత్రితో నీకేంపని కేటీఆర్? ఈ రేస్ కార్ల పందెంలో జరిగిన అవినీతిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు రెస్పాన్స్ రాలేదన్నారు. కేంద్ర మంత్రులను ప్రాధేయపడి కేసులు వెనక్కి తీసుకోవడానికి ఢీల్లీకి వెళ్లారా కేటీఆర్ అని ప్రశ్నించారు. అదానీ, అంబానీ లేదా ఢిల్లీలో ఎవరిని కలిసారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత లిక్కర్ స్కాంలో ఎవరి ప్రమేయంతో బెయిల్ పొందారో అదే రీతీలో ఢీల్లీలో ఎవరిని కలిసారో మాదగ్గర ఆదారాలు ఉన్నాయన్నారు. రెండు, మూడు రోజుల్లో ఏ బాంబు పేలుతుందో కేటీఆర్ కు తెలుసు. ఈ క్రమంలోనే కేటీఆర్ డిల్లీ పర్యటన హడావుడిగా చేసారు. ఈకార్ రేస్ లో తప్పు జరగ్గకుంటే ఎందుకు బయపడుతున్నారని అన్నారు. ఇది కూడా చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు! అంతరిక్షంలో కూసుంటరు.. ఇక విదేశాలకు 55 కోట్ల రూపాయలు ఎలా వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు. డబ్బులు చేతికి అందాకే ఎంవోయూలో సంతకాలు జరిగాయని ఆరోపించారు. ఒక్క కేసుకే ఇంత కంగారు పడితే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆ అన్నింటిని బయటపడేతే అంతరిక్షంలో కూసుంటారంటూ సెటైర్స్ వేశారు. పేదోడికి చెందాల్సిన ఆస్తులను కొల్లగొట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఆరాంఘర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం ఇది కూడా చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. బీఆర్ఎస్ నేతకు నోటీసులు! #kavitha #delhi-liqour-scam #ktr #kcr #minister-ponguleti-srinivas మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి