Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికలు.. ఏ పార్టీకి ఎంతశాతం ఓట్లు వచ్చాయంటే?

మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు నమోదయ్యాయో ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్‌కు 39.08 శాతం ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. బీఆర్‌ఎస్‌కు 28.75 శాతం, బీజేపీకి 15.67 శాతం, స్వతంత్రులకు 8.30 శాతం ఓట్లు నమోదైనట్లు ఈసీ తెలిపింది.

New Update
FotoJet (10)

Municipal elections

 Municipal Elections : తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్‌ కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికలు ముగిశాయి. కాగా ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను సొంతం చేసుకుంది.116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించారు.  వీటిలో కాంగ్రెస్‌ 1,347 వార్డుల్లో విజయం సాధించి 66 మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. బీఆర్‌ఎస్‌ 717 వార్డుల్లో గెలుపొంది 17 మున్సిపాలిటీలు చేజిక్కించుకుంది. బీజేపీ 261 వార్డుల్లో, స్వతంత్రులు 256 వార్డుల్లో విజయం సాధించారు. 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. 16న వాటి భవితవ్యం తేలనుంది.

ఇదిలా ఉండగా  మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం మేర ఓట్లు నమోదయ్యాయో ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మొత్తంగా కాంగ్రెస్‌కు 39.08 శాతం ఓట్లు పోలైనట్లు ఈసీ తెలిపింది. బీఆర్‌ఎస్‌కు 28.75 శాతం, బీజేపీకి 15.67 శాతం, స్వతంత్రులకు 8.30 శాతం, ఎంఐఎంకు 3.28 శాతం, ఫార్వర్డ్‌ బ్లాక్‌కు 1.5 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం, జనసేనకు 0.3 శాతం ఓట్లు నమోదైనట్లు ఈసీ వెల్లడించింది.  

కాగా హంగ్‌ ఏర్పడిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్‌. మేయర్‌ ఎన్నిక వరకు సభ్యలు చేజారకుండా ఉండటం అన్ని పార్టీలు వారిని క్యాంపులకు తరలించాయి. 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. నిజామాబాద్‌, కరీంనగర్‌ కార్పొరేషన్లలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించినప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌ దాటలేదు.దీంతో అక్కడి స్వతంత్రలు మీద బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్‌ లో సీపీఐ, కాంగ్రెస్‌ కు సమాన సీట్లు వచ్చినప్పటికీ ఇక్కడ కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ దాటలేదు. ఈ క్రమంలో రెండు పార్టీలు స్వతంత్రులను మచ్చిక చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. ఈ హంగ్‌ మున్సిపాలిటీల ఫతితాలు 16న తేలే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు