/rtv/media/media_files/2026/02/14/sharad-pawar-2026-02-14-19-43-17.jpg)
Sharad Pawar keen to contest Rajya Sabha polls, merger of NCP factions unlikely, Says Sanjay Raut
ఇటీవల మహారాష్ట్ర దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) విలీనం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం నడిచింది. దీనికి సంబంధించి తాజాగా శివసేన (UBT) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పోటీ చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ చర్చలు నిర్వహిస్తోందని తెలిపారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ వీలనం అయ్యే అవకాశం దాదాపు లేనట్లేనని స్పష్టం చేశారు.
Also Read: త్రిషను వదిలేయ్ ముందు'.. విజయ్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
దేశంలోనే సీనియర్ నేతల్లో ఒకరైన శరద్ పవార్ 60 ఏళ్లకు పైగా చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో మళ్లీ పోటీచేస్తానని పవార్ చెప్పినట్లు తెలిపారు. అయితే దీనిపై కూటమిలోని మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఇదిలాఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌లో శరద్ పవార్‌తో పాటు మరో ఏడుగురు సభ్యులు రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం విపక్ష మహా వికాస్ అఘాడీ బలం తక్కువగా ఉండటంతో ఈసారి ఒకరిని మాత్రమే రాజ్యసభకు పంపించే ఛాన్స్ ఉంది. దీంతే శరద్ పవార్‌కే ఆ ఛాన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
Also Read: సెప్టిక్ ట్యాంక్‌లో శవంగా తేలిన మహిళ.. కేసులో షాకింగ్ విషయాలు!
ఇదిలాఉండగా ఇటీవల శరద్ పవార్ ఛాతినొప్పితో పుణెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడినట్లు తెలుస్తోంది. శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి పవార్ డిశార్చి అయ్యారని ఆయన కూతురు సుప్రియా సూలే తెలిపారు. తన తండ్రి మూడు, నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని పేర్కొన్నారు. మరీ ఎన్సీపీ విలీనం సంజయ్ రౌత్ చెప్పినట్లు జరిగే అవకాశం లేదా ? లేక కలుసుకునే ఛాన్స్ వస్తుందా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Follow Us