ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన కోసం కువైట్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రవాస భారతీయులుతో కలిసి 'హలా మోదీ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కువైట్‌లో ఇంతమంది భారతీయులను చూడటం ఎంతో సంతోషంగా ఉందని.. ఇదో మినీ ఇండియాలా కనిపిస్తోందన్నారు. '' భారత్ నుంచి కువైట్‌కు రావాలంటే 4 గంటల సమయం పడితే.. ఓ భారత ప్రధాని మత్రం ఇక్కడికి వచ్చేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది.
Also Read: అయ్యో.. హుండిలో పడిపోయిన ఐఫోన్.. ఇవ్వమంటున్న ఆలయ అధికారులు
شكرا للكويت، أنا مسرور بهذا الترحيب الرائع. pic.twitter.com/e0UWeTOwhL
— Narendra Modi (@narendramodi) December 21, 2024
కువైట్‌కు ప్రతీ సంవత్సరం వందలాది మంది భారతీయులు వస్తున్నారు. ఇక్కడి సమాజానికి భారతీయతను పరిచయం చేశారు. భారతీయ ప్రతిభ, సాంకేతికత, సంప్రదాయాలను అనుసరించి కువైట్‌లో భారతీయ నైపుణ్యాన్ని నింపేశారు. ఇక్కడి దేశ వైద్య రంగంలో భారతీయ వైద్యులు, పారామెడికోలే ప్రధాన బలం. కువైట్ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడంలో భారతీయుల పాత్ర కీలకంగా ఉంది.
Also Read: శ్రీతేజ్ ఇప్పట్లో కోలుకోడు.. నాకే భయమేసింది: కోమటిరెడ్డి ఎమోషనల్!
విదేశీ కరెన్సీని స్వీకరించడంలో ప్రపంచంలోనే భారత్ అగ్రగ్రామిగా ఉంది. మీరందరూ కష్టపడి పనిచేయడం వల్లే ఈ రికార్డు సాధ్యమైంది. అరేబియా సముద్రానికి ఇరువైపులా ఉన్న భారత్, కువైట్‌లను దౌత్య సంబంధాలు మాత్రమే కాదు.. హృదయ సంబంధాలు కూడా దగ్గర చేస్తున్నాయి. గతంలో కూడా ఇరుదేశాల మధ్య బాగుండేవి.
The warmth and affection of the Indian diaspora in Kuwait is extraordinary. Addressing a community programme. https://t.co/XzQDP6seLL
— Narendra Modi (@narendramodi) December 21, 2024
Also Read: హైడ్రాకు అండగా ఉంటాం.. న్యాయనిపుణుల కీలక ప్రకటన!
అంతేకాదు కువైట్‌కు కావాల్సిన మనవ వనరులు, స్కిల్స్, టెక్నాలజీని అందించడంలో భారత్ ముందుంది. భారత్‌లో ఉన్న స్టార్టప్‌లు, సాంకేతికత కువైట్ అవసరాలకు పరిష్కరాలు చూపించగలవు. కొవిడ్-19 మహమ్మారి సమయంలో భారత్‌కు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసిన కువైట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలని'' ప్రధాని మోదీ అన్నారు.
Also Read: రుణమాఫీ 70శాతమే.. 100శాతం అని చెప్పడానికి సిగ్గుండాలి: కేటీఆర్