Flight Accident: ఘోర విమాన ప్రమాదం.. 20 మంది మృతి

సౌత్‌ సుడాన్‌లో మరో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటినట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన కాసేపటికి సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది.

New Update
Flight Accident

Flight Accident

ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా సౌత్‌ సుడాన్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటినట్లు అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. యూనిటీ అనే రాష్ట్రంలో గ్రేటర్ పయనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్థానిక కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 10.30 గంటలకు ఉద్యోగులను తీసుకొని రాజధాని జుబాకు బయలుదేరింది.       

Also Read: కేజ్రీవాల్‌కు హర్యానా CM దిమ్మతిరిగే కౌంటర్: స్వయంగా యుమునా నదిలో..

రన్‌వే నుంచి 500 మీటర్ల దూరం వెళ్లగా.. టెక్నికల్ సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానం కూప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంపై సౌత్‌ సుడాన్ యూనిటీ రాష్ట్ర సమాచార మంత్రి గాట్‌వెచ్‌ బిపాల్‌ బోత్‌ స్పందించారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. ఒక్కరే బయటపడినట్లు చెప్పారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మృతుల్లో 16 మంది సౌత్‌ సుడాన్‌ వారే ఉన్నారని అధికారులు తెలిపారు.   

ఇదిలాఉండగా ఈ విషాద ఘటనపై అక్కడి ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. 2011లో సౌత్‌ సుడాన్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. సౌత్‌ సూడాన్‌లో ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగడం సాధారణం అయిపోయింది. ప్రతికూల వాతారణం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. 

Also Read: ఎలా పడతార్రా బాబు.. పులి మూత్రం బాటిల్ రూ.600- కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఇటీవల దక్షిణ కొరియాలో ముయాన్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రయాణికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. థాయ్‌ల్యాండ్ నుంచి వస్తున్న విమానం సౌత్ కొరియాలో మయాన్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయ్యింది. కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు .  

Also Read: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు