/rtv/media/media_files/2025/03/22/FhrmPg2KO9IgytvlF80S.jpg)
CM Revanth KTR
Big Breaking:
రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌కు తాము సిద్ధమని.. సీఎంకు ప్రిపరేషన్‌కు టైమ్ కావాలంటే 72 గంటల సమయం ఇస్తున్నాం.. ప్రిపేర్ అయి రండి..అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు. చర్చ అసెంబ్లీలో పెడతారా లేక రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లిలో పెడతారా లేక కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో మీ ఇష్టం.. ప్లేస్, టైమ్, డేట్ అన్ని సీఎం ఇష్టం.. మేం ఎప్పుడైనా రెడీ? అని కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
Also Read: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆ రూట్లో వందేభారత్‌కు మరో 4 కోచ్‌లు
“నీటికి పల్లం ఎలా తెలుసో తెలంగాణ కు నీరు ఎవరు తీసుకు వచ్చారో అందరికి తెలుసు.. తెలంగాణ లో ఏ రైతు ను, ఎద్దును అడిగినా వ్యవసాయం పండుగ ఎవరు చేశారో చెప్తారు.. సీఎం నిన్న రంకెలు వేశాడు.. ఆయన సభ పెట్టాడంటే బూతులతోనే మాట్లాడతాడు.. మా పార్టీ తరుపున మీ సవాలు స్వీకరిస్తున్నాం.. ఎక్కడ చర్చ పెట్టినా వస్తాం.. మీకు కేసీఆర్ అవసరం లేదు.. మేము చాలు.. 72 గంటలు ఇస్తున్నాం.. మీరు ప్రిపేర్ అయి రండి.. సీఎంకు బేసిన్ లు తెలియదు బెండకాయలు తెలియదు అంటూ ఘాటుగా విమర్శించారు.
Also Read: కెచప్‌తో రోటీ పరోటా పిల్లలకు ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?
8వ తారీకున సోమజీగూడా ప్రెస్ క్లబ్ లో సీఎం కి ఒక కుర్చీ వేసి ఎదురు చూస్తాం. పారిపోకుండా సోమాజిగూడా ప్రెస్ క్లబ్ రా 8న రేవంత్ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. 8వ తేదీన ఉదయం 11గంలకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రేవంత్ రెడ్డితో చర్చకు సిద్దమన్న కేటీఆర్ రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిదామన్నారు. రైతుబంధును కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎగ్గొడుతుందన్న కేటీఆర్ అన్నదాతకు సున్నం పెట్టిందే.. కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు. చంద్రబాబు జలదోపిడికి వంత పాడుతోంది ఎవరో తెలియదా? చంద్రబాబు అస్సలు కోవర్టు రేవంత్ రెడ్డే అని ఆరోపించారు. ప్రజాపాలన కాదు.. తెలంగాణలో చంద్రబాబు కోవర్టు పాలన సాగుతుందన్నారు.
Also Read: బరితెగించిన హీరోయిన్..బాడీతో వ్యాపారం..రెండునెలల్లో రూ.10 కోట్ల ఇన్‌కం..
నిజం ఒప్పుకోని వాడిని.. నటించే వాడిని రేవంత్ రెడ్డి అంటారన్నారు. చర్చకు రేవంత్ రెడ్డి ముచ్చట పడ్తున్నాడన్న కేటీఆర్ రేవంత్ రెడ్డికి కేసీఆర్ అంత లేదు.. మేము చాలన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. ఉద్యోగాల కల్పనపై అశోక్ నగర్ లో నిరుద్యోగుల మధ్య చర్చకు రావాలి. నాలుగు వేల పెన్షన్, 2,500 కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల్లో సీఎం సొంత నియోజకవర్గంలో జడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గెలవదని ఎద్దేశా చేశారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మత్స్య సంపదను సృష్టించిందే కేసీఆర్. హారతులు పట్టి ఆంధ్రకు నీటిని పంపిందే కాంగ్రెస్ నేతలు అని కేటీఆర్ అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై పోరాటానికి బీఆర్ఎస్ రెడీ ఉందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తాము ఉద్యమం నడిపితే.. రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి, నియామకాలు ఆయన సన్నిహితులకు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు.
Also Read: ఉక్రెయిన్‌పై యుద్దం ఆపేది లేదు : పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్