/rtv/media/media_files/2025/01/15/ZOxxlXtGeEXiNdUHbkBY.jpg)
Trump Cartoon pic
అమెరికాలో 'ది సింప్సాన్స్' అనే ఓ కార్టు్న్ టీవీ షో చాలా పాపులర్. భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి అంచనా వేస్తుంది. స్మార్ట్ వాచ్‌ల నుంచి ప్రపంచంలో జరగబోయే ప్రధాన సంఘటనల గురించి ఈ ఐకానిక్ టీవీ షో తమ రెగ్యులర్ ఎడిసోడ్‌లలో అభిప్రాయాలను పంచుకుంటుంది. నెటిజెన్లు కూడా వీటికి సంబంధించిన మీమ్స్‌ను, వీడియో క్లిప్స్‌ను సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందిస్తుంటారు.
Also Read: కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే
అయితే ఈ 'ది సింప్సాన్స్' షోలో ఇటీవల వచ్చిన ఎపిసోడ్‌కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. 2025 జనరి 16న ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడుతుందని ఆ వీడియోలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న రోజే ఈ అంతరాయం జరుగుతున్నట్లు అందులో చూపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. కానీ వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారు జనవరి 16న కాదు.. జనవరి 20న ప్రమాణస్వీకారం చేస్తారు.
Also Read: ఆ విషయం లేట్ గా చెప్పారు..మస్క్ పై అమెరికా రెగ్యులేటర్ దావా!
అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు కూడా దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తున్నారు. జనవరి 16న నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడుతుందని పలువురు భావిస్తున్నారు. మరికొందరు ఇది కేవలం అమెరికాకి మాత్రమే పరిమితం అవుతుందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమే సముద్రంలో ఉండే షార్క్ ఇంటర్నెట్ కేబుల్స్‌ను కొరికేయడం వల్ల ఇంటర్నెట్‌కు అంతరాయం ఏర్పడుతుందని కామెడీగా మీమ్స్ షేర్ చేస్తున్నారు. అయితే దీన్ని కావాలనే ఎవరో అలా ఎడిట్ చేశారని అలాంటిదేమి జరగదని చెబుతున్నారు.