New Telecom Rule: కొత్త టెలికాం రూల్.. సిమ్ కార్డ్ తీసుకునేవారికి వారికి ఇది పక్కా

PM ఆఫీస్ నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌కు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి కొత్త సిమ్ కార్డు తీసుకునే వారి ఆధార్ బేస్ బయోమెట్రిక్ తప్పని సరి చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్‌తో SIM కనెక్షన్స్ అరికట్టడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
new rule

new rule Photograph: (new rule)

New Telecom Rule:ప్రధాన మంత్రి ఆఫీస్ నుంచి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్‌కు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి కొత్త సిమ్ కార్డు
(New Sim Card Rules)తీసుకునే వారి ఆధార్ బేస్ బయోమెట్రిక్ తప్పని సరి చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్‌తో నెట్‌వర్క్ కనెక్షన్ తీసుకోవడాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆ చర్య తీసుకుంది. చాలామంది ఫేక్ డాక్యుమెంట్స్‌పై సిమ్ కార్డ్ తీసుకొని వాటిని దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఇండియన్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ వంటి ఐదైనా ఐటీ ప్రూఫ్‌తో సిమ్ కార్డ్ కనెక్షన్ ఇస్తున్నారు. అయితే, కొత్త నిబంధనల ప్రకారం, కొత్త సిమ్ కార్డ్ యాక్టివేషన్‌లకు ఇప్పుడు ఆధార్ ద్వారా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఈ రూల్స్ పాటించకుండా రిటైలర్లు SIM కార్డ్‌లను విక్రయించడం నిషేదించారు.

Also Read: కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే

నకిలీ సిమ్ కార్డులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక స్కామ్‌లలో ఫేక్ డాక్యుమెంట్స్ తో తీసిన సిమ్ కార్డులను ఎక్కువ వాడుతున్నట్లు టెలికాం రంగంలో ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్ లో తేలింది. టెలికాం రూల్స్ బ్రేక్ చేయడం, సైబర్‌క్రైమ్స్(Cyber Crime) ఈసీగా చేస్తున్నారు. ఒకే మొబైల్‌కు మల్టిపుల్ నెంబర్స్ యూస్ చేయడం వల్లే సులభంగా డిజిటల్ అరెస్టులు, సైబర్ నేరాలు జరుగుతన్నాయని పరిశోధనల్లో వెల్లడయ్యాయి. చట్టాన్ని అమలు చేయడానికి ఏజెన్సీలు సహకరించాలని ప్రభుత్వం కోరింది. రూల్స్ బ్రేక్ చేసిన కంపెనీలకు జరిమానా విధించేందుకు AI సాధనాలను ఉపయోగించాలని PMO DoTని ఆదేశించింది. నకిలీ పత్రాలను ఉపయోగించి రిటైలర్లు సిమ్ కార్డులు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది.

Also Read: ఆ విషయం లేట్‌ గా చెప్పారు..మస్క్‌ పై అమెరికా రెగ్యులేటర్‌ దావా!

Advertisment
తాజా కథనాలు