/rtv/media/media_files/2024/11/02/x5llk8t9Gs6iTBmfypl7.jpeg)
Musk: దాదాపు రెండున్నరేళ్ల క్రితం ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ ను కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.ఆ తర్వాత దాని పేరును ఎక్స్ గా మార్చేశారు. అయితే ట్విటర్ లో ఈ వాటాల కొనుగోలు విషయాన్ని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు మస్క్ గడువులోగా తెలియజేయలేదట.
Also Read: క్రిటికల్ కండిషన్‌లో లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు..మరింత వేగంగా గాలులు..
దీంతో ఆయన పై యూఎస్ ఎస్‌ఈసీ తాజాగా దావా వేసింది.2022 ఆరంభం నుంచి ట్విటర్ లో మస్క్ వాటాలను కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. ఆ ఏడాది మార్చి నాటికి ఆయన కంపెనీలో 5 శాతం వాటాను దక్కించుకున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ నిబంధనల ప్రకారం..ఏదైనా కంపెనీ యాజమాన్యంలో 5 శాతం వాటా దాటితే ఆ విషయాన్ని 10 రోజుల్లోగా ఎక్స్ఛేంజ్‌కు వెల్లడించారు.
Also Read: Kamala Jobs: స్టీవ్ జాబ్స్ కోరిక తీర్చిన భార్య..కుదుటపడిన ఆమె ఆరోగ్యం
కానీ మస్క్ మాత్రం ఉన్న గడువు దాటి 11 రోజులు ఆలస్యంగా అంటే ఏప్రిల్ 4 వ తేదీన ఆ విషయాన్ని బహిర్గతం చేశారు. అప్పటికీ ఆయన వాటా విలువ 9.2 శాతానికి చేరింది. దీంతో ఈ వ్యవహారం పై ఎస్‌ఈసీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా ఎలాన్ మస్క్ పై వాషింగ్టన్ డీసీ ఫెడరల్ కోర్టులో దావా వేసింది.
గడువులోగా వాటాల విషయం వెల్లడించనందుకు గానూ ఆయనకు జరిమానా విధించాలని అందులో కోరింది. అంతేకాక..ఆ వాటాల నుంచి అందుకున్న లాభాలను కూడా ఆయన వదులుకునేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించింది. ఈ పిటిషన్ పై మస్క్ గానీ , ఎక్స్ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.
తొలుత ట్విటర్ లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేసిన మస్క్..ఆ తర్వాత కంపెనీని పూర్తిగా కొనుగోలు చేస్తానని ఆఫర్ ఇచ్చారు.ఇందుకోసం 2022 ఏప్రిల్ లో ఒప్పందం ఖరారు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత డబ్బుల విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు రావడంతో ఆ ఏడాది జులైలో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు మస్క్ ప్రకటించారు.
అనంతరం ఇది కోర్టు పరిధికి వెళ్లింది. ఎట్టకేలకు అదే ఏడాది ఏప్రిల్ లో 44 బిలియన్ డాలర్లకు మస్క్ ట్విటర్ ను సొంతం చేసుకున్నారు.అనంతరం దాన్ని ఎక్స్ గా పేరు మార్చి కొనసాగిస్తున్నారు.
Also Read: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్
Also Read: Mahakumbh:కుంభమేళాలో పాల్గొనే 14 అఖాడాలు ఇవే..అసలు వాటి చరిత్ర ఏంటంటే