Pashamylaram: పాశమైలారంలో మరో భారీ అగ్ని ప్రమాదం.. షాకింగ్ వీడియో

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఎన్విరో వేస్ట్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్‌ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.

New Update
Pashamylaram industrial explosion

Pashamylaram industrial explosion

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాద ఘటన యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా చనిపోయారు. ఈ విషాదకర ఘటన నుంచి తేరుకోక ముందే మరో ఘోరమైన అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 

Also Read :  MLC తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై దాడి

Pashamylaram Industrial Explosion

పాశమైలారంలోని మరో ఫ్యాక్టరీలో తాజాగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎన్ వీరో వెస్ట్‌ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  'మోనికా' పాటలో పూజతో స్టెప్పులేసిన ఈ నటుడు ఎవరు? సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో ఇవాళ (ఆదివారం) ఉదయం మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎన్ వీరో వెస్ట్‌ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో మంటలు పైపైకి ఎగిసిపడుతున్నాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read :  కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై పడుకున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్‌లో!

Also Read :  'ఇద్దరూ ఇద్దరే'..  అక్కినేనికి కోట అదిరిపోయే పంచ్!

sangareddy | Pashamylaram Fire Accident

Advertisment
Advertisment
తాజా కథనాలు