/rtv/media/media_files/2025/06/30/reactor-exploded-2025-06-30-20-58-47.jpg)
Reactor Exploded
Sigachi Industries : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు లో పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ లో రియాక్టర్ పేలిన సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రమాదంలో ఇప్పటి వరకు 16 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 163 మంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో 16 మంది చనిపోయారు. మరో 35 మంది చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. అయితే మిగిలిన 111 మంది జాడ ఇంతవరకు తెలియలేదన్న ప్రచారం సాగుతోంది. తమ వాళ్లు కనిపించడం లేదని కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ?
మూడు అంతస్తుల భవనం పూర్తిగా కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద ఇంకా కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ వర్షం కారణంగా పనులకు ఆటంకం కలుగుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 108 మంది మాత్రమే విధుల్లో ఉన్నారని సంస్థ వర్గాలు అంటున్నాయి. అయినా మిగిలిన వారి జాడ ఎక్కడా అనే ప్రశ్న తలెత్తుతోంది.శిథిలాల కింద ఎక్కువమంది చిక్కుకుని ఉంటే వారంతా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది. అటు తీవ్రంగా గాయపడినవారు, ఇటు శిథిలాల కింద చిక్కుకున్నవారితో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.
ఉదయం 9 గంటల ప్రాంతంలో బాయిలర్ లో ఎయిర్ ప్రెషర్ పెరగడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో రియాక్టర్ పేలిపోయింది. పేలుడు ధాటికి అక్కడ పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. రియాక్టర్ ఛాంబర్ భవనం కుప్పకూలగా.. మరో భవనం బీటలు వారింది. ప్రమాద స్థలిలో కార్మికుల మృతదేహాలు గుర్తు పట్టలేనంత చెల్లాచెదురయ్యాయి. కార్మికుల కుటుంబ సభ్యుల, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లి పోయింది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల్లో అనేక మంది పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.
ఇది కూడా చూడండి: CM Chandrababu Naidu: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. ఆ 15 మంది ఎమ్మెల్యేపై చర్యలు!
ప్రమాదం జరిగిన అనంతరం సుమారు 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మరోవైపు.. మరికొంతమంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావించారు. ఈ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భారీ క్రేన్ లు, హైడ్రాలిక్ పరికరాలను రంగంలోకి దింపాయి. కాగా కార్మికలు గల్లంతుపై యజమాన్యం సరైన సమాచారం ఇవ్వడం లేదని కార్మిక కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. వందలాది మంది కార్మికుల జాడ తెలియడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కాగా చనిపొయినవారు, గాయపడినవారే కాక ఇంకా చాలామంది ఆచూకీ లభించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. సుమారు 35 మంది ఆచూకీ లభించడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ ఇంకా ఎక్కుమందే గల్లంతయ్యారని స్థానికులు చెబుతున్నారు. మృతుల సంఖ్య భారీగా ఉంటే ఈ ప్రమాదం ఘోర దుర్ఘటనగానే భావించవచ్చు.
రియాక్టర్ కారణం కాదు...
కాగా సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి రియాక్టర్ పేలడం వల్ల కాదని.. వేడి గాలి అధిక ఒత్తిడి వల్లే భారీ పేలుడు సంభవించిందని అధికారులు అంటున్నారు. పరిశ్రమలో మైక్రో సెల్యులస్ పౌడర్ తయారు చేస్తున్న క్రమంలో బాయిలర్ నుంచి వచ్చే వేడి గాలికి పైప్ లైన్ వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడినప్పుడు పేలుడు సంభవించినట్లు తెలిపారు. వేడి గాలి తాకిడికి భవనం కుప్పకూలిందన్నారు. పేలుడు ధాటికి గోడలు బద్దలై పరిశ్రమలోకి వస్తున్న ప్లాంట్ ఇన్‌చార్జ్‌పై పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. భవన శకలాలు చుట్టుపక్కల పరిశ్రమలోకి దూసుకెళ్లాయన్నారు. పరిశ్రమలో రియాక్టర్లు భద్రంగానే ఉన్నట్లు అధికారులు తేల్చారు.
ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత