/rtv/media/media_files/2024/12/27/prBasSOWUfr7QiIKN0g2.jpg)
Palamuru-Ranga Reddy lift irrigation scheme case Supreme Court hearing
MEIL Corruption: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిల్ శుక్రవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ కుమార్‌లు నాగం జనార్దన్, మేఘా సంస్థ తరఫు న్యాయవాదుల వాదనలు విన్నారు. ఈ సందర్భంగా 2024 డిసెంబర్‌లో విచారణ సమయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు BHEL (Bharat Heavy Electricals Limited) అఫిడవిట్ దాఖలు చేసింది. ఎత్తిపోతల పథకంలో వినియోగించిన యంత్రాలు, వాటి బిల్లులు, తను పోషించిన పాత్ర గురించి BHEL అఫిడవిట్‌లో వివరంగా పేర్కొంది.
ఆరోపణలను నిజం చేస్తున్నాయి..
ఈ మేరకు విచారణలో BHEL కౌంటర్ చేసిన అఫిడవిట్‌లో తమ ఆరోపణలను నిజం చేస్తున్నాయని నాగం జనార్దన్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానానికి వివరించారు. ప్రభుత్వ టెండర్‌లో 3వ వంతు కూడా BHEL సంస్థకు చెల్లించలేదని అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అవినీతి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోందని, కావున వెంటనే స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ కోరారు. దీంతో BHEL దాఖలు చేసిన అఫిడవిట్, నాగం ఫైల్ చేసిన రిజాయిండర్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
3 పిటిషన్లు కొట్టివేత..
మరోవైపు తెలంగాణ హైకోర్టులో 3 పిటిషన్లు ఇప్పటికే కొట్టివేశారని మరికొన్ని పెండింగ్‌లో ఉన్నట్లు మేఘా సంస్థ తరఫు న్యాయవాది ముకుల్ ముకుల్ రోహత్గి వివరించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం స్వతంత్ర దర్యాప్తుకు అప్పగించే అంశంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణ మే 13 నుంచి జరుపుతామని జస్టీస్ సంజీవ్ కుమార్‌ల స్పష్టం చేసింది.
ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..
2017లో పిటిషన్..
నాగం జనార్దన్ రెడ్డి 2017లో బీజేపీలో ఉన్న సమయంలో హైకోర్టులో ఈ విషయానికి సంబంధించి పిల్ దాఖలు చేశారు. BHEL, MEIL మధ్య సంయుక్త ఒప్పందానికి కాంట్రాక్ట్ కేటాయింపు చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. ఈ కాంట్రాక్ట్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 2000 కోట్లకు పైగా నష్టం కలిగిందని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రాజెక్టులో ఉపయోగించే పరికరాల విలువను మోసపూరితంగా రూ. 5,960 కోట్ల నుంచి రూ. 8,386 కోట్లకు పెంచారని అన్నారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే ఈ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.