Osmania University: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. అధికారుల తీరుపై ఆగ్రహం
ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్స్లో కనీస మౌలిక సదుపాయలు కల్పించడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వేసవిలో మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఉందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.