Telangana : పరువు హత్య.. 9 నెలల గర్భిణిని గొడ్డలితో నరికి చంపేసిన మామ

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో దారుణం జరిగింది. దహేగాం మండలంలోని,  గెర్రే గ్రామంలో రాణి అనే 9 నెలల గర్భిణిని ఆమె మామ సత్యనారాయణ అతి దారుణంగా హత్య చేశాడు.

New Update
komuram

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా(komuram-bheem-district) లో దారుణం జరిగింది. దహేగాం మండలంలోని,  గెర్రే గ్రామంలో రాణి అనే 9 నెలల గర్భిణిని ఆమె మామ సత్యనారాయణ అతి దారుణంగా హత్య చేశాడు. గొడ్డలి, కత్తితో నరికి మరి ఆమె ప్రాణాలు తీశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యనారాయణ కుమారుడు శేఖర్‌ అదే గ్రామంలో ఎదురింట్లో ఉండే రాణిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.

Also Read :  తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

వేర్వేరు కులాలు కావడంతో

అయితే ఇద్దరివి వేర్వేరు కులాలు కావడంతో శేఖర్‌ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో సత్యనారాయణ కుటుంబంలో కలహాలు చెలరేగాయి. దీంతో శేఖర్‌, తన భార్యతో కలిసి అత్తవారింట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే కొడలిపై పగ పెంచుకున్న సత్యనారాయణ ఎలాగైనా ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే శనివారం అత్తమామలతోపాటు శేఖర్‌ అడవికి వెళ్లినట్లు తెలుసుకున్న సత్యనారాయణ.. ఎవరూ లేని టైమ్ చూసి.. రాణిని దారుణంగా హత్య చేశాడు.

Also Read :  గచ్చిబౌలిలో విషాదం.. నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

ఇప్పుడు రాణి  9 నెలల గర్భిణి. ఈ ఘటనపై  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు పరువు హత్యగా అనుమానిస్తున్నారు. ప్రేమించిన వాడి కోసం కన్న తల్లిదండ్రులను, బంధువులను వదిలి వచ్చిన ఆమె మనసును అర్థం చేసుకోలేని మామ.. కులం భావనతో కళ్లు మూసుకుపోయిన అహంకారంతో తొమ్మిది నెలల గర్భవతిని చంపేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisment
తాజా కథనాలు