Numayish: ఫిబ్రవరి 15తో ముగియనున్న నుమాయిష్‌..

జనవరి 3న హైదరాబాద్‌లోని నాంపల్లిలో ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 15తో నుమాయిష్‌ ముగుస్తుందని నిర్వహకులు తెలిపారు. మరో రెండ్రోజులు ప్రదర్శనను కొనసాగించేందుకు పర్మిషన్ అడగగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ నిరాకరించారు.

New Update
Numayish Exhibition

Numayish Exhibition


హైదరాబాద్‌లోని నాంపల్లిలో నుమాయిష్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి 3న 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల(నుమాయిష్) ప్రారంభమైంది. ఫిబ్రవరి 15తో నుమాయిష్‌ ముగుస్తుందని నిర్వహకులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ప్రదర్శనను కొనసాగించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఎగ్జిబిషన్ సొసైటీ కోరింది. కానీ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ ఇందుకు నిరాకరించారు. 

Also Read: ఆప్‌ ఓటమిపై స్పందించిన ప్రశాంత్ భూషణ్‌.. కేజ్రీవాల్‌పై విమర్శలు

1938లో నిజాం కాలంలో ప్రారంభమైన నుమాయిష్‌ను అప్పటినుంచి ప్రతీ ఏడాది నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ప్రదర్శనను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో సహా దేశం నలుమూలల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావండతో భారీగా వచ్చారు. ఈ ప్రదర్శనలో జమ్మూకశ్మీర్‌ డ్రై ఫ్రూట్స్, హ్యాండ్‌ క్రాఫ్ట్స్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ నుంచి హస్తకళ వస్తువులు ఉంచారు. 

Also Read: కాళేశ్వరంలో మహాకుంభాభిషేకం ..42 సంవత్సరాల తర్వాత మరోసారి....

అలాగే దేశంలోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులతో సహా అన్ని రకాల స్టాల్స్‌ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఇక్కడ ప్రదర్శన ఉంటుంది. ఇక వారాంతాలు, సెలవులు ఉన్నప్పుడు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది. 

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది మావోయిస్టులు మృతి.. అమిత్ షా సంచలన ప్రకటన

Also Read: పంచాయతీ పెట్టి పరువు తీసిందని ప్రాణం తీశాడు.. గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు


Advertisment
Advertisment
తాజా కథనాలు