హైదరాబాద్‌లో ప్రతీ ఏడాది ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్) నిర్వహిస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న 84వ నుమాయిష్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఈ కార్యక్రమం ప్రారంభ తేదీ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి1 న ప్రారంభం కావాల్సిన నుమాయిష్.. జనవరి 3కి వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి 2వ తేదీ వరకు సంతాప దినాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిషన్ వాయిదా పడిందని నిర్వాహకులు తెలిపారు. Also Read: మన్‌కీ బాత్‌లో ఏఎన్నార్ ప్రస్తావన.. ఎన్టీఆర్‌ను మర్చిపోయిన మోదీ జనవరి 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దాదాపు 45 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 1938లో నిజాం కాలంలో ఈ నుమాయిష్ కార్యక్రమం మొదలైంది. ఈ ఎగ్జిబిషన్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలుల నుంచి సందర్శకులు వస్తుంటారు. అందరీ సౌకర్యార్థం ఎగ్జిబిషన సొసైటీ.. గాంధీ భవన్, అజంతా, గోషామహల్ గేట్‌లను అందుబాటులో ఉంచింది. Also Read : Telangana: దారుణం.. తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు పోలీసులు మృతి..! సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అలాగే సందర్శకులు మైదానంలో తిరిగేందుకు తాత్కాలిక రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. భద్రత బలగాలు కూడా మోహరించారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన డ్రై ఫ్రూట్స్.. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి హస్తకళ వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి. ఈ ఎగ్జిబిషన్‌కు సాయంత్రం గంటల నుంచి రాత్రి 11 వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. Also Read: చైనా మరో అద్భుతం.. గంటకు 450 కి.మీ ప్రయాణించగల రైలు ఆవిష్కరణ Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్