Telangana: దారుణం.. తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు పోలీసులు మృతి..!

తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో వరుస ఆత్మహత్య ఘటనలు కలవరం రేపుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో వీరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సూసైడ్ చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.

New Update
Three Constables Died In Separate Incidents In Telangana

Three Constables Died In Separate Incidents In Telangana

పోలీసుల ఆత్మహత్యలు ఈ మధ్య విపరీతమయ్యాయి. అప్పుల బాధ తాళలేక కొందరు, అక్రమ సంబంధాలతో ఇంకొందరు, అనారోగ్య సమస్యలతో మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి. ఇటీవల వాజేడు ఎస్సై సురేశ్ తన రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. 

ALSO READ: బాక్సింగ్ డే టెస్ట్.. థర్డ్ అంపైర్ కాల్‌పై కమిన్స్ అసహనం!

ఇద్దరు పోలీసులు ఆత్మహత్య

అది మరువక ముందే రీసెంట్‌గా కామారెడ్డి జిల్లాలో మరో ఇద్దరు పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక ఎస్సై, మహిళా కానిస్టేబుల్ చెరువులో మృతదేహాలుగా తేలారు. అది కూడా మరువకముందే ఇప్పుడు మరో ముగ్గురు పోలీసులు మరణించడం కలకలం రేపింది. ఒకేరోజు ముగ్గురు కానిస్టేబుళ్లు వేర్వేరు ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ALSO READ: ఏపీలో వారందరికీ గుడ్ న్యూస్.. అదనంగా రూ.4000!

చెట్టుకు ఉరేసుకుని మృతి

తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. కొల్చారంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని సాయి అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. సాయి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభించారు. దీని తర్వాత తెలంగాణలో మరో ఘటన జరిగింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాలకుంట కాలనీలో బాలకృష్ణ అనే AR కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. 

ALSO READ: యువతి ప్రేమకు బందీలుగా మారిన సింహాలు

గుండెపోటుతో మరొకరు

భువనగిరికి చెందిన మరో హెడ్ కానిస్టేబుల్ దోసపాటి బాలరాజు గుండెపోటుతో  మరణించాడు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే తోటి సిబ్బంది హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గ మధ్యంలోనే బాలరాజు మరణించాడు. అతడి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ALSO READ: యువతకి కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్

AR కానిస్టేబుల్ సూసైడ్

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాలకుంట కాలనీలో బాలకృష్ణ అనే AR కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య మానస, ఇద్దరు పిల్లలు యశ్వంత్, ఆశిరిత్‌కు పురుగుల మందు ఇచ్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ బాలకృష్ణ మరణించగా.. అతడి భార్య, పిల్లలు ఇద్దరూ హస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అప్పుల బాధతోనే కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. ఇలా ఒక్కరోజే ముగ్గురు మరణించిన ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు