BIG BREAKING: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఉత్కంఠ పరిస్థితి మధ్య రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ZPTC, MPTC ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది.

New Update
notification

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. ఉత్కంఠ పరిస్థితుల మధ్య రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో విచారణ జరుగుతుండగానే ZPTC, MPTC ఎలక్షన్ ప్రక్రియ మొదలైంది. 53 రెవెన్యూ డివిజన్లో తొలివిడత 292 జెడ్సీసీ, 2963 ఎంపీటీసీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో MPTCలకు మండల కార్యాలయాల్లో.. ZPTC జిల్లా పరిషత్ ఆఫీసుల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి అన్నీ జిల్లాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కూడా ఈరోజే సాయంత్రం లోగా వెల్లడించనుంది. నిన్నటి విచారణలో నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్లు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు బీసీ రిజర్వేషన్లపై న్యాయపోరాటం, మరో వైపు ఎన్నికల నిర్వహణ రెండూ కొనసాగుతున్నాయి.

రెండు దశల్లో జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి(అక్టోబర్ 9) నుంచి అక్టోబర్ 11 వరకు మొదటి దశ నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అక్టోబర్ 23న MPTC, ZPTC మొదటి విడత ఓటింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.

రెండో దశ ఎన్నికలు:

అక్టోబర్‌ 13 నుంచి రెండో విడత నామినేషన్లు 
అక్టోబర్‌ 29న రెండో దశ ఎన్నికల పోలింగ్‌

Advertisment
తాజా కథనాలు