/rtv/media/media_files/2026/02/14/congress-mayor-candidate-katipalli-shamanta-2026-02-14-14-57-56.jpg)
congress mayor candidate katipalli shamanta
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసింది. కొందరు అభ్యర్థులు లక్షలు, కోట్లు ఖర్చు చేసినా కూడా గెలవలేకపోయారు. నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంత కూడా దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసినా ఎన్నికల్లో ఓడిపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే..19వ డివిజన్ ఇందూరు నుంచి శమంత బరిలోకి దిగారు. ఆ డివిజన్‌లో రూ.8 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయి. దీంతో నామినేషన్ వేసేటప్పుడే ఆమె రూ.8 కోట్లు చెల్లించారు.
ఆమెతో పాటు మిగతా వందలాది మంది అభ్యర్థులు కూడా పన్ను బకాయిలు చెల్లించారు. ఆ ఒక్క డివిజన్‌లోనే ఏకంగా రూ.8.5 కోట్లకు పైగా బకాయిలు వసూలైనట్లు సమాచారం. కాటిపల్లి శమంత రూ.8 కోట్ల పన్ను చెల్లించి నో డ్యూ సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ముందుగానే ఆమెను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఆమె డివిజన్ వ్యాప్తంగా ఓటర్లకు డబ్బులు కూడా పంచింది. మొత్తంగా రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ఓటర్లు ఆమెపై కనికరం చూపించలేదు. ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు.
Also Read: బెల్లంపల్లిలో కాంగ్రెస్‌కు షాక్.. KTR సమక్షంలో గులాబీ గూటికి కౌన్సిలర్లు
ఇదిలాఉండగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. ఇందులో బీజేపీ 28 చోట్ల గెలిచింది. అధికార కాంగ్రెస్ 17, MIM 14, బీఆర్‌ఎస్ 1 స్థానాల్లో మాత్రమే గెలిచాయి. ఇందులో ఓ పార్టీకి మెజార్టీ రాలేదు. మేయర్ పీఠం దక్కాలంటే 31 స్థానాల్లో గెలవాలి. MIMతో కలిపి తమకు 31 స్థానాలు ఉన్నాయని కాంగ్రెస్ భావించింది. మరోవైపు ఎక్స్ ఆఫీషియో సభ్యుల ఓట్లతో తమ పార్టీకే ఇందూరు మేయర్ స్థానం వస్తుందని బీజేపీ అంటోంది. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.
ఇదిలాఉండగా మున్సిపాలిటీ ఎన్నికల్లోని 116 స్థానాలకు కాంగ్రెస్ 66 చోట్ల గెలిచింది. విపక్ష బీఆర్‌ఎస్ పార్టీ 13 స్థానాల్లో గెలిచింది. బీజేపీ ఒక్క మున్సిపాలిటీలో కూడా సగానికంటే ఎక్కువ వార్డుల్లో గెలవలేదు. వార్డుల పరంగా చూసుకుంటే 2851 వార్డుల్లో కాంగ్రెస్ 1347, బీఆర్‌ఎస్ 716, బీజేపీ 261 స్థానాల్లో గెలిచింది. ఇక MIM, లెఫ్ట్ పార్టీలు, ఇతరులు కలిపి 257 స్థానాల్లో గెలిచారు. మరోవైపు 7 మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ మూడింటిని కైవసం చేసుకుంది. ఒకటి బీజేపీ రాగా మరో మూడు చోట్ల హంగ్ వచ్చింది.
Also Read: కాంగ్రెస్, BRS, MIM పార్టీలకు బండి సంజయ్ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు
Follow Us