బెల్లంపల్లిలో కాంగ్రెస్‌కు షాక్.. KTR సమక్షంలో గులాబీ గూటికి కౌన్సిలర్లు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. ఉత్కంఠ పరిస్థితితుల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొదట హంగ్ ఏర్పడ్డా.. ఎన్నికల్లో గెలిచిన కొందరు అభ్యర్థులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

New Update
bellampally

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. ఉత్కంఠ పరిస్థితితుల్లో బెల్లంపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొదట హంగ్ ఏర్పడ్డా.. ఎన్నికల్లో గెలిచిన కొందరు అభ్యర్థులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. బెల్లంపల్లి 34 వార్డుల్లో ఉండగా.. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలకు 17 మంది వార్డు మెంబర్ల మద్దతు కావాలి. ఇందులో కాంగ్రెస్-14 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. 14 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క స్థానంలో బీజేపీ, ఐదుగురు స్వతంత్రులు వార్డు మెంబర్లుగా గెలిచారు. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ (17) రాలేదు.

గులాబీ గూటికి కౌన్సిలర్లు

బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన వివిధ పార్టీల కౌన్సిలర్లు శనివారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి కూడా అధికారికంగా బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. అధికార పార్టీ నుంచి కౌన్సిలర్ ప్రతిపక్ష పార్టీలోకి మారడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

బీజేపీ అభ్యర్థి మద్దతు

వీరితో పాటు బీజేపీకి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామూర్తి కూడా కేటీఆర్‌ను కలిశారు. ఆయన ప్రస్తుతానికి సాంకేతిక కారణాల వల్ల అధికారికంగా పార్టీలో చేరకపోయినప్పటికీ, బీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలు మరియు కేటీఆర్ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ గెలుపు కోసం, పార్టీ బలోపేతం కోసం తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు.

బలోపేతం దిశగా బీఆర్ఎస్

మున్సిపల్ ఎన్నికలు లేదా స్థానిక సంస్థల బలోపేతం దృష్ట్యా ఈ చేరికలు బెల్లంపల్లిలో బీఆర్ఎస్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర వర్గాల నుండి నేతలు రావడం వల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పట్టు మరింత పెరగనుంది. స్థానిక నాయకత్వం మరియు కేటీఆర్ వ్యూహాల వల్లే ఈ మార్పు సాధ్యమైందని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు