Gram Panchayat Elections 2025: కొలువు తీరనున్న కొత్త పంచాయతీలు..స్వాగతం పలుకుతున్న సమస్యలు

తెలంగాణలో గ్రామ పంచాయతి ఎన్నికలు ముగిశాయి. గడచిన సంవత్సరన్నరగా అన్ని పార్టీలకు సవాలుగా మారిన ఎన్ని్కలు ముగియడంతో గ్రామాల్లో నూతన పాలక వర్గాలు కొలువుతీరాయి. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

author-image
By Madhukar Vydhyula
New Update
Newly Elected Sarpanches, Ward members to take oath today

Newly Elected Sarpanches

Gram Panchayat Elections 2025: తెలంగాణలో గ్రామ పంచాయతి ఎన్నికలు(telangana grama panchayat) ముగిశాయి. గడచిన సంవత్సరన్నరగా అన్ని పార్టీలకు సవాలుగా మారిన ఎన్ని్కలు ముగియడంతో గ్రామాల్లో నూతన పాలక వర్గాలు కొలువుతీరాయి.  నేడు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గత ఎన్నికలకు భిన్నంగా చాలామంది యువకులు సర్పంచ్ గా పోటీ చేయడానికి ముందుకు రావడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అయితే  కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు గ్రామాల్లో సమస్యల పరిష్కారం సవాల్‌గా మారనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్నేళ్లుగా నిధులు రాకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ లోపం, విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు ఎన్నికల్లో గెలుపొందేందుకు పలువురు అభ్యర్థులు గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి సొంత మేనిఫెస్టోలు తయారు చేసుకుని వాటిని అమలు చేస్తామన  విస్త్రత ప్రచారం చేశారు. అనేక హామీలు గుప్పించారు. గెలిచిన తర్వాత వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత వారిపై పడింది. కానీ, చాలా గ్రామాల్లో  అసలు నిధులే లేవు.దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులతో ఇచ్చిన హామీలు మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన ఎలా చేస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది. - Gram Panchayat Elections 2025

Also Read :  UAPA: ఉపా కేసుపై మజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్టు.. అసలేంటి ఈ చట్టం ?

గ్రామాల్లో విలయతాండవం చేస్తున్న సమస్యలు

తెలంగాణలోని పలు గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. గత పాలక వర్గాలు 2019 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 1వ తేదీ వరకు అధికారంలో ఉన్నాయి. ఆ సమయంలో ప్రభుత్వాల నుంచి నిధులు సక్రమంగా రాకపోయినప్పటికీ సర్పంచ్‌లు చేసేదిలేక తమ సొంత ఖర్చులతో వీధి దీపాలు, తాగునీటి బోర్ల మరమ్మతులు చేయించారు. వివిధ పథకాల్లో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు ఆ బిల్లులు రాకపోవడంతో మాజీ సర్పంచ్‌లంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సగానికి పైగా పంచాయతీల్లో చెత్త సేకరణ ట్రాక్టర్లు మూలన పడి ఉన్నాయి. ఫలితంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వీధి దీపాలు, తాగునీటి బోర్ల విద్యుత్‌ బిల్లులు భారీ మొత్తంలో పేరుకుపోయి ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సైడ్‌ కాలువలు, రోడ్లపై చెత్త పేరుకుపోయి ఉంది. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలను పట్టించుకునే వారే కరువయ్యారు. పలు గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం కొత్త సర్పంచ్‌లపై ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.

సమస్యలతో స్వాగతం..

కొత్తగా కొలువుదీరుతున్న పంచాయతీ పాలకవర్గాలకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. దాదాపు రెండేళ్లుగా పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. శనివారంతో ప్రత్యేక అధికారుల పాలన ముగిసి కొత్త పాలకవర్గాలు అధికారంలోకి వస్తున్నాయి. 2024 ఫిబ్రవరి 2తో గత పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా ప్రత్యేకాధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి 22 నెలలుగా వారి పాలనలోనే పంచాయతీలు కొనసాగుతున్నాయి. ఇంతకాలం పాలకవర్గాలు లేక పోవడంతో గ్రామాల్లో అనేక సమస్యలు పేరుకుపోయాయి. చెత్త నిర్వహణ కొరవడింది. తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. 
వీధి దీపాల కోసం వాడుకుంటున్న విద్యుత్‌ బిల్లులు పేరుకుపోయాయి. ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచి పోయాయి. రాష్ట్రం కూడా తన వాటా నిధులను ఇవ్వలేక పోయింది. పేరుకే ప్రత్యేకాధికారులు ఉన్నప్పటికీ పంచాయతీల నిర్వహణ భారమంతా కార్యదర్శులు మోయకతప్ప లేదు. పంచాయతీ కార్యదర్శులు కూడా తమకు సాధ్యమైనంత వరకు నెట్టుకొచ్చారు. చాలా మంది అప్పుల పాలయ్యారు. కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారంతో కార్యదర్శులకు ఇబ్బందులు తప్పనుండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైతేగానీ పంచాయతీల సమస్యలు పరిష్కరించడం సాధ్యమయ్యేపని కాదని పలువురు స్పష్టం చేస్తున్నారు. - CM Revanth Reddy

సర్పంచ్‌ విధులు, బాధ్యతలు..

సర్పంచ్ అంటే గ్రామా గ్రామ ప్రథమ పౌరుడు/ పౌరురాలిగా పరిగణిస్తారు. అతను ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. పాలకవర్గం సమావేశానికి, గ్రామసభకు అధ్యక్షత వహిస్తారు. నెలకు గౌరవ వేతనంగా 6500 ప్రభుత్వం అందజేస్తుంది. ప్రతి రెండు నెలలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం ఏర్పా టు చేయాలి. అదే విధంగా ఏడాదికి రెండు సార్లు అంటే.. ప్రతి ఆరు నెలలకోసారి (అక్టోబర్‌ 2, ఏప్రిల్‌ 24) గ్రామ సభను విధిగా నిర్వహించాలి. ఈ సభకు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు, అణగారిన వర్గాల అభ్యున్నతి, మౌలిక వసతుల కల్పనపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.
పంచాయతీ కార్యాలయంలో రికార్డులను తనిఖీ, సంబంధిత సమాచారం తీసుకోవాలి
పంచాయతీ సభ్యులు ఎవరైనా అనర్హతకు గురైతే పంచాయతీ జిల్లా అధికారికి సమాచారం ఇవ్వాలి
పంచాయతీ కార్యదర్శి పాలన, కార్యనిర్వహణపై నియంత్రణ ఉండాలి
పంచాయతీకి ఆదాయ వనరుల పెంపు, వాణిజ్య సముదాయాలు ఇతరత్రా వాటి ద్వారా ఆదాయం పెంచేందుకు కృషి చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను గ్రామ అభివృద్ధి కోసం పాలకవర్గాల తీర్మానాలతో వెచ్చించాలి
అవినీతి రహితంగా పారదర్శకంగా తన పాలనను అందించాలి
ఏదైనా అవినీతికి పాల్పడినా, గ్రామ సభలు నిర్వహించక పోయినా స్పష్టమైన ఆధారాలుంటే సర్పంచ్‌ను తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది.

Also Read :  రేవంత్ సర్కార్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు!

అత్యవసర అధికారాలు..

అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం సర్పంచ్‌కు ఉంటుంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ఇతరత్రా గ్రామానికి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో విచక్షణ అధికారాలను కలిగి ఉంటారు.

ఉప సర్పంచ్‌ విధులు, బాధ్యతలు..

సర్పంచ్‌ అందుబాటులో లేని సమయంలో పంచాయతీ పాలకవర్గం సమావేశాలకు అధ్యక్షత వహించవచ్చు. సర్పంచ్‌ పదవి ఏదైనా కారణంతో ఖాళీ అయినప్పుడు, లేదా సుధీర్ఘ కాలం సెలవులో వెళ్లినప్పుడు ఉప సర్పంచే ఇన్‌చార్జి సర్పంచ్‌గా కొనసాగుతాడు. అదే విధంగా 2018 కొత్త పంచాయతీ రాజ్‌ చట్టంలో సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కు చెక్‌ పవర్‌ను ఉమ్మడిగా కల్పించిన విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు